అన్వేషించండి

పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?

పాకిస్థాన్ అనే పేరు తొలుత 1933లో ప్రాచుర్యం లోకి వచ్చింది. దీన్ని తొలి సారిగా చౌదరీ రహమత్ అలీ అనే వ్యక్తి ప్రతిపాదించారు.  ఇతను పాకిస్థాన్ స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి, .

Story Behind Name of Pakistan | బ్రిటీష్ ఇండియాలో పాక్ భూబాగమంతా ఇండియాలో భాగంగా ఉండేది. 1947 ఆగష్టు 14 న పాకిస్థాన్ దేశంగా అవతరించింది. లార్ట్ మౌంట్ బాటన్ భారత దేశానికి పరిపాలన పగ్గాలు అప్పగించే ప్రణాళికలో దేశ విభజన అంశం కూడా పొందుపరిచారు.  అయితే పాకిస్థాన్ ఏర్పాటుకు మహమ్మద్ అలీ జిన్నా మూల కారకుడు. భారత జాతీయ కాంగ్రెస్ లో జిన్నా  ఒకప్పుడు సభ్యుడయినా ఆ తర్వాత గాంధీ సిద్ధాంతాలు, ముస్లిం లకు ప్రత్యేక హక్కులు ఉండాలన్న తన వాదనతో వారితో విబేధించి ముస్లిం లీగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ముస్లింల హక్కులే ధ్యేయంగా స్వాతంత్రోద్యమ కాలంలో పని చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ముస్లింలకు ప్రత్యేక రాజ్యం ఉండాలన్న డిమాండ్ తో హింసాకాండకు దిగారు.  ఆ తరుణంలో అప్పటి బ్రిటిష్ పాలకులు  భారత ఉపఖండం రెండు దేశాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు.   ముస్లిం మెజార్టీ ప్రజలకు ఓ దేశం, హిందు, సిక్కు, జైనులు, ఇతర అల్ప సంఖ్యాక వర్గాల వారందరికి ఓ దేశం  ఉండాలని దేశ విభజన నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్థాన్ అనే పేరు అర్థం ఇదే

పాకిస్థాన్ అనే పేరు తొలుత 1933లో ప్రాచుర్యం లోకి వచ్చింది. దీన్ని తొలి సారిగా చౌదరీ రహమత్ అలీ అనే వ్యక్తి ప్రతిపాదించారు. ఇతను పాకిస్థాన్ స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ఓ డిక్లరేషన్ ను ప్రతిపాదించారు. ఆందులో ఈ పాకిస్థాన్ అనే పదం  వాాడారు.  అయితే ఇతను లండన్ లో ఉండేవాడు. చివరకు పాకిస్థాన్ దేశం ఏర్పడినా లండన్ లోనే నివాసం ఉండి అక్కడే మరణించారు.  పాక్ అనే పదం ఉర్దూ, పర్షియా భాషల్లో పరిపూర్ణత లేదా శుద్దత అనే అర్థం  వస్తుంది.  ఇస్తాన్ అనే దానికి భూమి లేదా దేశం అనే అర్థం వస్తుంది. అయితే పాకిస్థాన్ అనే పదంకు  కింది అర్థాలను కూడా చెప్పుకుంటారు. 

P - Punjab (పంజాబ్)
A - Afghania (అఫ్ఘానియా) లేదా బలూచిస్తాన్ (Balochistan)
K - Kashmir (కశ్మీర్)
S - Sindh (సింధ్)

ఈ అర్థంతో పాకిస్థాన్ ఏర్పడిందన్న ప్రచారం ఉంది. అయితే పాకిస్థాన్ ప్రధానంగా పంజాబ్, సింధ్,  బలుచిస్థాన్, ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రాంతాలతో  ఏర్పడింది. 1971 లో బంగ్లాదేశ్ ఓ దేశంగా  ఏర్పడక ముందు పాకిస్థాన్ లో భాగంగా ఉండేది. పాకిస్థాన్ లోని ప్రస్తుత ప్రదేశాలన్నీ బ్రిటీష్ ఇండియాలో అనేక ప్రావిన్స్ లలో భాగమై ఉన్నాయి.  ప్రస్తుతం పాకిస్థాన్  ఆనాడు పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేది.  మన దేశంలో ఆనాడు ఇది ఓ పెద్ద ప్రావిన్సు గా పరిగణించబడేది. విభజన సమయంలో రెండుగా విడిపోయింది.  పాకిస్తాన్ లోని పంజాబ్ గా, భారత్ లో పంజాబ్ గా  ఇది విభజించబడింది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలో సింధ్ ప్రావిన్సుగా పరిగణించబడేది.  బలుచిస్థాన్  బ్రిటీష్ ఇండియాలో భాగం. ఇప్పుడు పాకిస్థాన్ లో భాగమైంది. ఖైబర్ ఫక్తూన్ ఖ్వా బ్రిటీష్ ఇండియాలో అప్ఘన్ మాతా ప్రాంతంలో భాగమై ఉండేది.   పాకిస్థాన్ లోని కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్  పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేవి. ఇప్పుడు పాక్  లో భాగమయ్యాయి.

జిన్నా పాకిస్థాన్ అనే పేరును ఎప్పుడు ఆమోదించారు ?

పాకిస్థాన్ నిర్మాతగా మహమ్మద్ ఆలీ జిన్నాను పిలుస్తారుత. 1933 లో చౌదరీ రహమత్ అలీ పాకిస్థాన్ అనే పదాన్ని తొలి సారి ప్రస్తావనకు తెచ్చినప్పటికీ ఆలీ జిన్నా ఆమోదం తర్వాతే విశేష ప్రాచుర్యంలోకి వచ్చింది.  1940 లో  పాకిస్థాన్ అనే దేశం ముస్లింల కోసం ఏర్పడాలన్న తీర్మానంపై ముస్లింలీగ్  కోల్ కత్తాలో సమావేశమయింది.  లాహోర్ డిక్లరేషన్  దీన్నే లాహోర్ తీర్మానం అంటారు.  జిన్నా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముస్లింల కోసం ఏర్పడే దేశానికి పాకిస్థాన్ అనే పేరు పెట్టాలని  అధికారికంగా ప్రకటించారు. ఇలా మొదలయిన దేశ విభజన ఉద్యమ ఫలితంగా 1947లో పాకిస్థాన్ ఏర్పాటయింది.

Also Read: Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
Embed widget