అన్వేషించండి
Advertisement
Top Headlines Today: లడ్డూ అంశంపై కేంద్రం కీలక ఆదేశాలు, బంగ్లాదేశ్‌తో తొలిటెస్ట్‌లో పటిష్టస్థితిలో భారత్ -మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 Headlines Today:
1. లడ్డూ అంశంపై కేంద్రం కీలక ఆదేశాలు
తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని.. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ తీవ్ర ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా నిర్దేశించారు. లడ్డూలో జంతువుల కొవ్వు వాడడం తీవ్ర విషయమని.. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. కోట్లాది మంది బాధపడ్డారు: రాహుల్
తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలుపుతున్నారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్న వేళ.. ఈ వివాదంపై లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత అని రాహుల్ అన్నారు. దేశంతో పాటు ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులకు బాలాజీ ఆరాధ్య దేవుడన్న రాహుల్.. లడ్డూ వివాదం ప్రతీ భక్తుడిని ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. లడ్డూ కల్తీపై జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారన్న ఆరోపణలన్నీ కట్టుకథలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేస్తారా అని జగన్ ప్రశ్నించారు. దేవుళ్లను కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. లడ్డూ కల్తీ నిజమే: టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనే వాదనలపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. 'కొంత కాలంగా లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోటు సిబ్బందితో మాట్లాడాను. వారు కూడా నెయ్యి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను కూడా నెయ్యిలో నాణ్యతా లోపాన్ని గుర్తించాను. మేం హెచ్చరించాకే గుత్తేదారులు క్వాలిటీ పెంచారు.' అని ఈవో తెలిపారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. సీనియర్ ఎవరబ్బా.. జగన్ కీలక వ్యాఖ్యలు
బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారిపోవడంపై జగన్ స్పందన వైరల్‌గా మారింది. బాలినేని పార్టీ మార్పుపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా " హూ ఈజ్ సీనియర్ " అంటూ జగన్ తిరిగి ప్రశ్నించారు. రాజకీయాల్లో సీనియర్లు ఎవరూ ఉండరని, నాయకుడు అనే వాడు ప్రజల్లో నుంచి పుడతాడే తప్ప పార్టీల నుంచి కాదని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. పవన్ కల్యాణ్‌కు విరాళం అందించిన ఆది
హైపర్ ఆది మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ను కలిసి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వరదల కారణంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలకు అందజేయాలని ఆది కోరారు. ఈ మూడు లక్షల్లో వరదల పీడిత గ్రామమైన ఎ.కె.మల్లవరం పంచాయతీకి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి కోసం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. తెలంగాణ సర్కార్‌కు ఊరట.. ఇక కౌన్సెలింగ్ షురూ
తెలంగాణలో మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో స్థానికత అంశం పెను దుమారాన్నే రేపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నీట్ పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో నివాసం ఉన్న, చదివిన వాళ్లు మాత్రమే వైద్య విద్యలో ప్రవేశానికి అర్హులని తేల్చింది. ఈ మేరకు ప్రవేశాల జరగాలని జీవో 33ని రిలీజ్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టు ఎత్తేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. లోయలో పడ్డ ఆర్మీ బస్సు.. ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. మస్క్‌కు మూడేళ్ల జైలు శిక్ష..!
అమెరికా ఎన్నికల సమీపిస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌నకు మద్ధతుగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కీలక కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మస్క్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ట్రంప్‌కు సమీపంలో ఇటీవల కాల్పుుల జరిగినప్పుడు బైడెన్, కమలా హ్యారిస్ పై ఎందుకు హత్యాయత్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల కేసులో మస్క్‌కు భారీ జరిమానాతో పాటు ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. ముగిసిన రెండో రోజు ఆట.. పటిష్టస్థితిలో భారత్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమాయనికి టీమిండియా 308 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. 227 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం ఇప్పటికే 308కి చేరింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion