Elon Musk : టెస్లా చీఫ్ మస్క్‌కు ఐదేళ్ల జైలు శిక్ష తప్పదా - ఇలా ఇరుక్కుపోయారేంటి ?
America elections : యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా ఉన్న టెస్లా, ఎక్స్ చీఫ్ ఎలాన్ మాస్క్ చిక్కుల్లోపడ్డారు. ఆయనకు ఐదేళ్ల శిక్ష పడేలా సీక్రెట్ సర్వీస్ విచారణ జరుపుతోందని మీడియా ప్రకటించింది.
Elon Musk Could Face 5 Years In Prison : అమెరికా ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరింది. మిగతా వారి సంగతేమో కానీ.. డొనాల్డ్ ట్రంప్ కోసం.. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారు. పదే పదే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. ఇలా ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకు సమస్యలు తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ జరిమానాతో పాటు ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడేలా ఆయనపై కేసులు నమోదయినట్లగా తెలుస్తోంది. దీనంతటికి కారణం.. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలా హ్యారిస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే.
పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ట్రంప్ గోల్ఫ్ కోర్సులో గోల్ప్ ఆడుతూండగా ఆయన వద్దకు వచ్చిన ఓ వ్యక్తి తుపాకీ తీసి కాల్చబోయాడు. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ కమెండోలు దాడి చేసి అతన్ని పట్టుకుని పోయారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో వివాదాస్పద ట్వీట్లు చేశారు. వాళ్లు డొనాల్డ్ ట్రంప్ ను మాత్రమే ఎందుకు చంపాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తర్వాత ఏ ఒక్కరు కూడా.. బైడెన్, కమలా హ్యారిస్‌పై ఎందుకు హత్యాయత్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. బైడెన్, కమలా హ్యారీస్‌లపై హత్యాయత్నాలు చేయమని రెచ్చగొట్టినట్లుగా ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
మస్క్ వ్యాఖ్యలను సీక్రెట్ సర్వీస్ సీరియస్ గా తీసుకుందని చర్యలు తీసుకునేలా దిశగా కొన్ని ప్రయత్నాలు ఇప్పటికే జరిగినట్లుగా అమెరికన్ మీడియా చెబుతోంది. మస్క్ సోషల్ మీడియా పోస్టులపై సీక్రెట్ సర్వీస్ కు అంతా తెలుసని.. ఇలాంటి వాటిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని సీక్రెట్ సర్వస్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తమ రక్షణలో ఉన్న వారి రక్షణకు ఎలాంటి సమస్యలు సృష్టిచే ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: బతకడం చాలా ఈజీ - ఈ ప్రకటన చూసిన తర్వాత మీరే నమ్ముతారు !
ఎలాన్ మస్క్ మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఉంటున్నారు. గత ఎన్నికల సమయంలోనూ మద్దతుగా నిలిచారు. అప్పట్లో ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ బ్యాన్ చేయడంపై మ్కస్క్ మండిపడ్డారు. అప్పటికీ ట్విట్టర్ మస్క్ కొనుగోలు చేయలేదు. తర్వాత ఆయన ట్విట్టర్ ను కొనుగోలు చేసి ఎక్స్ గా మార్చారు. తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. అప్పటికే ట్రంప్ తన సొంత సోషల్ మీడియా సంస్థ ట్రూత్ సోషల్ ను ప్రారంభించి అందులోనే పోస్టులు పెడుతున్నారు.