అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ వివాదంపై కేంద్రం ఫోకస్- నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశం

Sri Venkateswara Swamy Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో నెలకొన్న వివాదం దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది కోట్లమంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్రం జోక్యం చేసుకుంది.

Tirumala Laddu Issue: తిరుమల శ్రీనివానివాసుడి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూను స్వచ్ఛమైన నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారంటూ సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేయడంతో అన్ని వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో ఇలాంటి అపచారం చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తే... మరో వైపు కేంద్రం కూడా ఈ వివాదంపై ఫోకస్‌ పెట్టింది. 

చంద్రబాబుతో మాట్లాడిన జేపీ నడ్డా

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదాన్న కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రమంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు లెటర్లు రాస్తున్నారు. ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి నడ్డా స్పందించి చంద్రబాబుతో మాట్లాడారు. మొత్తం వ్యవహారంపై ఫుల్ రిపోర్టు ఇవ్వాలని ఏపీ సీఎంను కోరారు. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన జేపీ నడ్డా శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత లోపాలపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు పంపిచాలని సూచించారు. కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. 

నివేదిక వచ్చిన తర్వాత చర్యలు: నడ్డా

రాష్ట్రం ప్రభుత్వం సమగ్ర విచారణ చేసిన తర్వాత రిపోర్టు సమర్పిస్తుందని అనంతరం ఏం చేయాలనే విషయంపై చర్చిస్తామన్నారు జేపీ నడ్డా. కేంద్రం, రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.  

కఠిన చర్యలు తీసుకోవాలి: ప్రహ్లాద్ జోషి

మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తప్పు ఎక్కడ జరిగినా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయం విన్నప్పుడు చాలా ఆందోళన కలిగిందన్నారు. తనతోపాటు కోట్ల మంది భక్తులకు ఇదే ఫీలింగ్ ఉంటుందని అందుకే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ఫొటోలు తొలగించారు: శోభా కరందాజే 

ఇంకో కేంద్రమంత్రి శోభా కరందాజే కూడా జగన్‌పై, వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తిరుమల కళాశాలల్లో పద్మావతి, వేంకటేశ్వరుడి చిత్రాలు తొలగించి వాటి స్థానంలో వేరే ఫొటోలు పెట్టించారని మండిపడ్డారు. బోర్డు ఛైర్మన్‌ను కూడా హిందూయేతర వ్యక్తిని నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి: బండి సంజయ్‌

ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన ఆయన... టీటీడీని హిందూయేతరలకు అప్పగించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget