Top Headlines Today: బొమ్మ హిట్, జోష్‌లో టీడీపీ- తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు- టాప్‌టెన్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
సభ సక్సెస్
విజయనగరం: తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏజీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనన్నారు. త్వరలోనే అమరావతి, తిరుపతిలో సభలు పెడతాం. అందులో రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కట్టింది ఒకటే ప్రాజెక్టు అదీ కూలిపోతోంది
బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కాళేళ్వరం ప్రాజెక్టు మాత్రమే కట్టిందని, అది కూడా ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంపై చర్చలో భాగంగా భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల, వారు చేసిన అప్పులను భరించడానికి.. తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి విక్రమార్క చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రజల కోసం కట్టిన మైత్రి
టీడీపీ, జనసేన మైత్రిని చాలా కాలం పాటు కాపాడుకోవాల్సి ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. యువగళం సభకు నన్ను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు .. 220రోజులు, 97 నియోజకవర్గాల్లో 3వేలకు పైగా చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు లోకేష్ తెలుసుకున్నారన.ి. ఇది లోకేష్ గారి రోజు.. అటు వంటి సభలో నేను ఉండటం సబబా అని అడిగానన్నారు. అయితే
లోకేష్ గారు, చంద్రబాబు ఆహ్వానం మేరకు నేను మనస్పూర్తిగా ఇక్కడకు వచ్చాననని తెలిపారు. ఈ పాదయాత్ర జగన్ చేసిన లాంటి పాదయాత్ర కాదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో 2023 కంటే ముందు తర్వాత
తెలంగాణ రాష్ట్రానికి 2023 సంవత్సరం పెను మార్పులు తీసుకు వచ్చింది. రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. కేసీఆర్ ఉన్నంత కాలం ఆయనకు తెలంగాణ పాలకుని కిరీటం ఉంటుందని అనుకున్నారు. కానీ రాజకీయాల్లో అలాంటి అంచనాలు ఎప్పుడూ నిజమవ్వాలని లేదని ప్రజలు నిరూపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అజయ్ కుమార్‌కి అర్జున అవార్డు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పల్నాడు జిల్లా(Palnadu District)కు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి(Valloori Ajay Kumar Reddy) అర్జున అవార్డు(Arjuna Award )కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన భారత్ అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. మాచర్ల(Macharla)లో పుట్టి పెరిగి.. నరసరావుపేట(Narasaraopeta)లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అజయ్ కుమార్.... అక్కడే క్రికెట్ ఆడటం నేర్చుకున్నారు. అంచలంచెలుగా అంధ క్రికెట్‌లో రాణిస్తూ భారత జట్టుకు ఆడటంతో పాటు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. అర్జున అవార్డుకు అజయ్ ఎంపిక కావటంతో పలువురు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో హై అలర్ట్
తెలంగాణలో కరోనా కేసులు డబుల్ డిజిట్ కు చేరుకున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ బుధవారం కరోనా బులిటెన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు దేశంలో నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అప్రమత్తం చేసింది. సాధ్యమైతే బయటకు వచ్చినప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలని చెబుతున్నారు. గతంలో తరహాలోనే భౌతిక దూరం పాటించడం, గుంపులోకి వెళ్లకపోవడమే ఆరోగ్యానికి మంచిదని ప్రజలను వైద్యశాఖ మంత్రి, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని చంచల్ గూడ జైలకు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ ఏ1గా ఉన్నాడు. గజ్వేల్ మండలం కొల్గూరులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రశాంత్‌ను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ తరువాత ఫ్యాన్స్ వార్ నడిచింది. కొందరు ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రశాంత్ సోదరుడు రఘురాజ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సిరీస్ పట్టేది ఎవరు?
సఫారీ గడ్డపై కీలక మ్యాచ్‌కు టీమిండియా(Team India) సిద్ధమైంది. వన్డే సిరీస్(One Day International)లో ఆఖరి సమరానికి భారత్-దక్షిణాఫ్రికా(South Africa) సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఒడిసిపట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చరిత్ర సృష్టిస్తారా?
సొంతగడ్డపై ఇంగ్లాండ్(England)పై చరిత్రలోనే భారీ విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత(India )మహిళలు మరో టెస్ట్‌కు సిద్ధమయ్యారు. బలమైన ఆస్ట్రేలియా(Australia) మహిళలతో ఏకైక టెస్టు నేటి నుంచే ప్రారంభం కానుంది. ఆసీస్‌తో ఆడిన 10 టెస్టుల్లో భారత్ ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఆ జట్టుపై తొలి టెస్టు విజయం సాధించాలని తహతహలాడుతున్న భారత్....స్పిన్నే ఆయుధంగా బరిలోకి దిగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హ్యాపీ బర్త్‌డే టూయూ తమన్నా
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. మూడు పదుల వయసు దాటిపోయినా, ఇప్పటికీ కుర్ర భామతో పోటీగా ఆఫర్స్ అందుకుంటోంది. ఓవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోలతో కలిసి ఆడిపాడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా నేటితో 34 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి