![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
HBD Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా? నటి మాత్రమే కాదు వ్యాపారి కూడా!
Tamannaah Bhatia Biography: నేడు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
![HBD Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా? నటి మాత్రమే కాదు వ్యాపారి కూడా! 8 Things You Didn’t Know About Birthday Beauty Tamannaah Bhatia HBD Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా? నటి మాత్రమే కాదు వ్యాపారి కూడా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/21/dfff520ec3b5b136bd3d1e94b56107d61703118730011686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Happy Birthday Tamannaah Bhatia: దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. మూడు పదుల వయసు దాటిపోయినా, ఇప్పటికీ కుర్ర భామతో పోటీగా ఆఫర్స్ అందుకుంటోంది. ఓవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోలతో కలిసి ఆడిపాడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా నేటితో 34 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
తమన్నా భాటియా గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు..
⦿ తమన్నా భాటియా 15 ఏళ్ళ వయసులో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాతో 2005లో తెరంగేట్రం చేసింది. అదే ఏడాది 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతకముందు ఆమె నటించిన 'లాఫ్జోన్ మెయిన్' అనే మ్యూజిక్ వీడియో మంచి పేరు తెచ్చిపెట్టింది.
⦿ గ్లామర్ షోకి కేరాఫ్ గా నిలిచే తమన్నా, కెరీర్ ప్రారంభంలో 'కెడి' (2006) అనే తమిళ్ మూవీలో నెగెటివ్ రోల్‌లో నటించి పలువురి ప్రశంసలు అందుకుంది. 2021లో 'అందాధున్' రీమేక్ గా తెరకెక్కిన 'మ్యాస్ట్రో' సినిమాలోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
⦿ తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఆధిపత్యం చెలాయించిన తమన్నా.. హిందీ, కన్నడ, మరాఠీ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవలే 'బంద్రా' అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
⦿ తండ్రీకొడుకులతో రొమాన్స్ చేసిన అతి తక్కువ మంది హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఆమె 'రచ్చ' సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా.. 'సైరా నరసింహారెడ్డి', 'భోళా శంకర్' చిత్రాల్లో చిరంజీవికి జంటగా నటించింది.
⦿ 2021లో '11త్ అవర్' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టింది తమన్నా. ఆ తర్వాత 'నవంబర్ స్టోరీ' 'జీ కర్దా' 'ఆఖరీ సచ్' వెబ్ సిరీస్ లలో నటించింది. 'లస్ట్ స్టోరీస్ 2' వంటి ఆంథాలజీ సిరీస్ లోనూ భాగమైంది.
⦿ తమన్నా భాటియా 1989 డిసెంబర్ 21న ఒక సింధీ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తండ్రి సంతోష్ వజ్రాల వ్యాపారి. తల్లి పేరు రజనీ భాటియా.
⦿ న్యూమరాజీని నమ్మే మిల్కీ బ్యూటీ తన స్క్రీన్ నేమ్ ను మార్చుకుంది. అయితే పూర్తిగా తన పేరు మార్చుకోకుండా ఒరిజినల్ స్పెల్లింగ్ లో కొద్దిగా చేంజెస్ చేసింది.
⦿ ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపించే తమన్నా, సొంతంగా ఒక జ్యువెలరీ బ్రాండ్‌ను నడుపుతోందనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. 'వైట్-ఎన్-గోల్డ్' అనే నగల బ్రాండ్ కు క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తూ సక్సెస్ ఫుల్ ఎంటర్ప్రీన్యుర్ అనిపించుకుంది.
⦿ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. 'లస్ట్ స్టోరీస్ 2' షూటింగ్ టైంలో ప్రేమలో పడిన ఈ జంట త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: బాలీవుడ్ లో భంగపాటు - పాన్ ఇండియా స్టార్స్ అవుదామని బోల్తాపడ్డ టాలీవుడ్ హీరోలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)