అన్వేషించండి

India W vs Australia W: ఇక ఆస్ట్రేలియా పని పట్టాలి , నేటి నుంచే మహిళల ఏకైక టెస్ట్‌

India Women vs Australia Women: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌పై చరిత్రలోనే భారీ విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత మహిళలు మరో టెస్ట్‌కు సిద్ధమయ్యారు.

సొంతగడ్డపై ఇంగ్లాండ్‌(England)పై చరిత్రలోనే భారీ విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత(India )మహిళలు మరో టెస్ట్‌కు సిద్ధమయ్యారు. బలమైన ఆస్ట్రేలియా(Australia) మహిళలతో ఏకైక టెస్టు నేటి నుంచే ప్రారంభం కానుంది. ఆసీస్‌తో ఆడిన 10 టెస్టుల్లో భారత్‌ ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఆ జట్టుపై తొలి టెస్టు విజయం సాధించాలని తహతహలాడుతున్న భారత్‌....స్పిన్నే ఆయుధంగా బరిలోకి దిగుతోంది. వాంఖడే(Wankhede) వేదికగా ఈ ఏకైక టెస్టు జరగనుంది. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న భారత్‌.. ఆసీస్‌పై కూడా నయా చరిత్ర లిఖించాలని భావిస్తున్నది. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న భారత్‌.. ఆసీస్‌పై కూడా నయా చరిత్ర లిఖించాలని భావిస్తోంది. ఆసీస్‌ బలంగానే ఉన్నప్పటికీ స్పిన్నర్లకు సహకరించే పిచ్‌పై ఆడడం ఆ జట్టుకు సవాలుగా మారనుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(Harmanpreet Kaur)తో పాటు స్మృతి మంధన(Smriti Mandhana), షఫాలీ వర్మ(Shafali Verma), జెమీమా రో డ్రిగ్స్‌(Jemimah Rodrigues), రిచా ఘోష్‌(Richa Ghosh), దీప్తి శర్మ(Deepti Sharma), స్నేహ్‌ రాణా (Sneh Rana )సమిష్టిగా రాణించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది.
 
గతవారం స్పిన్‌తో ఇంగ్లాడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన హర్మన్‌ ప్రీత్‌ సేన... అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. దీప్తి శర్మ తన స్పిన్‌తో మరోసారి మాయా చేస్తే ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పవు. అలీసా హీలీ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు పటిష్టంగా ఉంది. మూనీ, పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్‌, గార్డ్‌నర్‌, అనాబెల్‌, అలానా కింగ్‌, జెస్‌ జాన్సన్‌తో కూడిన ఆస్ట్రేలియాను అడ్డుకోవాలంటే మనవాళ్లు శక్తికి మించి పోరాడాల్సిందే. ఆస్ట్రేలియా మహిళలు చివరిసారి 1984 ఫిబ్రవరిలో భారత్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడారు. టీమ్‌ ఇండియా, ఆస్ట్రేలియా చివరిసారి రెండేళ్ల కింద టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 
 
భారత బౌలింగ్‌లో దీప్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. రేణుకా సింగ్ ఠాకూర్ కొత్త బంతితో మెరుగ్గా రాణిస్తోంది. పూజా వస్త్రాకర్ కూడా ఇంగ్లాండ్‌పై మూడు వికెట్లు తీసి సత్తా చాటింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (49, 44) జెమిమా రోడ్రిగ్స్ (68), యాస్తికా భాటియా (66) మెరుగ్గా రాణించారు. వీరు మరోసారి రాణిస్తే టీమిండియా విజయానికి బాటలు వేసుకున్నట్లే. వాంఖడే స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన జట్టులో చేరాలని భారత్ కోరుకుంటోంది.
 
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన శుభా సతీష్ గాయపడింది. ఈ మ్యాచ్‌లో శుభా సతీష్‌ ఆడడం అనుమానంగా మారింది. ఆమె స్థానంలో ప్రియా పునియా ఆడే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన ఎల్లీస్ పెర్రీ, ఆష్లీగ్ గార్డనర్, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్‌లతో ఆస్ట్రేలియా బలంగా ఉంది. 
 
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్ , స్నేహ రాణా, శుభా సతీష్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, రేణుక సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, మేఘనా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్
 
ఆస్ట్రేలియా జట్టు: డార్సీ బ్రౌన్, లారెన్ చీటిల్, హీథర్ గ్రాహం, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, అలిస్సా హీలీ (కెప్టెన్), జెస్ జోనాస్సెన్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ షుట్, సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget