అన్వేషించండి

Girl Murder Case: రామచంద్రపురం బాలిక హత్య: అక్కా అంటూ ఇంటికి వెళ్లి ప్రాణాలు తీసేశాడు.. షాకింగ్ నిజాలు!

రామ‌చంద్ర‌పురంలో సంచ‌ల‌నం రేకెత్తించిన ప‌దేళ్ల బాలిక హ‌త్య కేసు చిక్కుముడి వీడింది..అక్కా అంటూనే బాలిక త‌ల్లితో ప‌రిచ‌యం పెంచుకున్నవ్య‌క్తి చిన్నారి హంతకుడు అని తెలిసి అంతా షాక్‌కు గుర‌య్యారు..

రామ‌చంద్ర‌పురంలో సంచ‌ల‌నం రేకెత్తించిన ప‌దేళ్ల బాలిక హ‌త్య కేసు చిక్కుముడి వీడింది.. సంచ‌ల‌నం క‌లిగించిన బాలిక అనుమాన‌స్ప‌ద మృతి కేసు పోలీసుల‌కు స‌వాలుగా మారింది.. అక్కా అంటూనే బాలిక త‌ల్లి సునీత‌తో ప‌రిచ‌యం పెంచుకున్న యువ‌కుడే చిన్నారి ఉసురుతీసిన హంతకుడు అని తెలిసి అంతా షాక్‌కు గుర‌య్యారు.. చిన్నారి మృతిచెందిన నాటి నుంచి ఆ కుటుంబానికి వెన్నంటే ఉన్న‌ట్లు న‌టిస్తూ త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నించాడు.. చివ‌ర‌కు పోలీసుల విచార‌ణ‌లో గుట్టుర‌ట్టు అయ్యి ఊచ‌లు లెక్కిస్తున్నాడు.

రామ‌చంద్ర‌పురంలో బాలిక రంజిత అనుమాన‌స్ప‌ద కేసును అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నేతృత్వంలో ద‌ర్యాప్తుచేప‌ట్టిన పోలీసులు అస‌లు నిందితుడ్ని పట్టుకున్నారు.. బాలిక రంజిత  హ‌త్య‌కేసును ఛేదించిన పోలీసులు ఆదివారం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అస‌లు హంత‌కుడి   తొలుత అంతా బాలిక అత్మ హ‌త్య‌గా భావించిన పోలీసులు స్కూల్ సిబ్బందిపై అనుమానం వ్య‌క్తం చేపి ఆదిశ‌గా విచార‌ణ చేప‌ట్టారు.. ఆత‌రువాత అక్క‌డ ఎటువంటి ఒత్తిడికి గురికాలేద‌ని, పైగా చాలా బాగా చ‌ద‌వ‌డమే కాకుండా చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌ని తేల‌డంతో ఫోరెన్సిక్ నిపుణుల‌ను సైతం ర‌ప్పించి హంత‌కుడు కోసం ద‌ర్యాప్తు ప్రారంభించారు.. చివ‌ర‌కు అస‌లు నిందితుడ్ని క‌నిపెట్టి జైలుకు పంపారు..

ఇంట్లోనే ఫ్యాన్‌కు వేళాడుతూ విగ‌త జీవిలా...

రామ‌చంద్ర‌పురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో స్టాప్‌ న‌ర్స్‌గా ప‌నిచేస్తున్న సిర్రా సునీత ఉద్యోగ రీత్తా రామ‌చంద్ర‌పురంలో టి.న‌గ‌ర్ క‌మ‌ల్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటోంది. భ‌ర్త ముంబైలో ఉంటుండ‌గా వీరికి ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద‌కుమార్తె వేరే ప్రాంతంలో చ‌దువుకుంటుండ‌గా మృతిచెందిన బాలిక రంజిత స్థానిక ఓ ప్ర‌యివేటు స్కూల్‌లో 5వ త‌ర‌గ‌తి చ‌దువుతుంది.. ఈనెల 4న‌ కాకినాడ వెళ్లిన త‌ల్లి సునీత‌కు స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చిన చిన్న‌కుమార్తె రంజిత ఫోన్ చేసి స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చేసిన‌ట్లు తెలిపింది.. అయితే సుమారు 7 గంట‌ల ప్రాంతంలో ఇంటికి వ‌చ్చిన సునీత‌కు ఇంటి గ‌ది త‌లుపు లోప‌ల‌ గ‌డియ పెట్టి ఉండ‌డంతో త‌లుపు తీయ‌మ‌ని ఎంత పిలిచినా త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో కంగార‌య్యి చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చారు.

అదే స‌మ‌యంలో ఇంటి య‌జ‌మాని కుమారుడు జాకీర్ కూడా వ‌చ్చి కిటికీ త‌లుపులు తీసి దానినుంచి త‌లుపు గ‌డియ తీశాడు. వారితో పాటు త‌ల్లి సునీత‌కు స‌న్నిహితుడిగా ఉన్న పెయ్య‌ల శ్రీ‌నివాస్‌ అనే వ్య‌క్తి కూడా ఉన్నాడు. అప్ప‌టికే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరికి వేళాడుతూ విగ‌త జీవిగా క‌నిపించింది చిన్నారి రంజిత‌.. ఉరి నుంచి దింపి  చిన్నారిని హుటాహుటీన ఏరియా ఆసుప‌త్రికి త‌రలించారు. అప్ప‌టికే చిన్నారి రంజిత మృతిచెందిన‌ట్లు వైద్యులు దృవీక‌రించారు.. త‌ల్లి సునీత ఫిర్యాదు మేర‌కు అనుమాన‌స్ప‌ద కేసుగా న‌మోదు చేసిన పోలీసులు మొద‌ట స్కూల్ టీచ‌ర్ల‌ను విచారించారు. ఆత‌రువాత ఇంటి గ‌డియ తీసిన ఇంటి య‌జ‌మాని కుమారుడు జ‌కీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయినా కేసు చిక్కుముడి వీడ‌లేదు.. 

అతి ప్ర‌వ‌ర్త‌నే దోషిని ప‌ట్టించింది..

బాలిక కుటుంబం నివాసముంటున్న ద‌గ్గ‌ర్లోనే సెల్‌షాప్ నిర్వ‌హిస్తున్న పెయ్యల శ్రీనివాస్ అనే వ్య‌క్తి బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు.. బాలిక తండ్రి ముంబైలో పని చేస్తుండగా తల్లి స్థానిక ఏరియా ఆసుపత్రిలో న‌ర్సుగా ప‌నిచేస్తుండ‌డంతో అక్కా అంటూ ద‌గ్గ‌ర‌య్యాడు. ఈక్ర‌మంలోనే బాలికకు ఏమైనా తినుబండారాలు, విద్యా సామాగ్రి కావాలంటే ఇతనికి ఫోన్ చేసి బాలిక త‌ల్లి సునీత‌ రప్పించి పెట్టే అంత చనువు పెంచుకున్నాడు. చిన్న పని పెద్ద పని చేస్తూ ఉండటంతో బాలిక తల్లిదండ్రులు ఇతని పూర్తిగా నమ్మారు. కేసు దర్యాప్తులో ఉండగా ఏరియా ఆసుపత్రి వద్ద ఇంటి వద్ద  బాలిక తల్లి తండ్రి బంధువుల వద్ద ఉండి అన్నీ తానై చూసుకోవ‌డం.. బాలిక చ‌దువుతున్న‌ స్కూల్ వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ సీసీ కెమెరా పుటేజీ తీసుకుని ఇతను పెట్టిన వాట్సాప్ మెసేజ్  పోలీసులు దృష్టికి చేరింది.. దీంతో అస‌లు ఎవ‌రీ  పెయ్యల శ్రీనివాసు.? అంటూ ఇత‌ని ఓవ‌ర్ యాక్ష‌న్‌పై దృష్టిశారించారు. దీంతో వాడి అతి ప్ర‌వ‌ర్త‌నే కేసు ఛేద‌న‌లో వాస్త‌వాదొంగ‌త‌నానికి వ‌చ్చి చిన్నారిని హ‌త్య‌.. లు వెల్ల‌డ‌య్యేలా చేసింది.. 

సంచ‌ల‌నం సృష్టించిన చిన్నారి రంజిత హ‌త్య కేసులో అస‌లు నిందితుడు పెయ్యల శ్రీనివాసు అని నిర్ధారించారు పోలీసులు.. క్రైమ్ సీన్‌లో ల‌భించిన సాంకేతిక ఆధారాలుతో శ్రీ‌నివాస్ వేలి ముద్ర‌లు మ్యాచ్ అవ్వ‌డంతో అదుపులోకి తీసుకుని విచారించారు. త‌మ దైన శైలిలో పోలీసులు విచారించ‌డంతో చేసిన దుర్మార్గం క‌క్కాడు. 
ఆర్ధిక ఇబ్బందులు, ఇ ఏం ఐ వాయిదాల చెల్లింపులు, చెల్లెలు పెళ్లికి చేసిన అప్పులు తీర్చేందుకు  ఇతర ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో పెయ్యల శ్రీనివాసరావు ఈ అఘాత్యానికి పాల్పడినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రెస్‌మీట్‌లో వెల్ల‌డించారు. 

అద‌నుచూసి ఇంట్లోకి దూరి.. 

స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చిన బాలిక ఇంట్లో ఒక్క‌ర్తే ఉంద‌ని గ‌మ‌నించి గెడ తీసి చోరీ చేసేందుకు వెళ్లిన పెయ్యల శ్రీనివాసు ను బాలిక చూసి రూమ్ కి ఎందుకు వచ్చావని నిలదీసింది.. ఫ్యాను రిపేరు చేయడానికి వచ్చాను అని తెలిపడంతో  ఫ్యాన్ బాగానే పనిచేస్తుంది కదా ఈ విషయం మా అమ్మ‌కు ఫోన్ చేసి చెబుతాను అన‌గానే ఈ విషయం తల్లితో ఫోన్లో  చెప్తుందనే
 భయం తో  రంజిత ను హత్య చేసి ఆత్మ హత్య గా చిత్రీ కరించేందుకు నిందితుడు శ్రీనివాసు  బాలిక మెడకు చున్నీ వేసి ప్యాన్ కు వ్రేలాడదీసి చంపేశాడ‌ని ఎస్పీ తెలిపారు. కేసు ను పక్కదారి పట్టించే విధంగా ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్రయత్నం చేశాడు... అంతే కాకుండా ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చాక బాలిక ఆత్మ హత్యకు పాల్పడింది అంటూ  స్కూల్ వద్ద కు వెళ్ళి సి సి పుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ ను వాట్సాప్ లో పెట్టి హడావుడి చేశాడు.

బాలిక తల్లిదండ్రులను ఇతను ఎంతగా నమ్మించాడంటే ఇతను చెప్పిన అంశాల ఆధారంగానే ప్రెస్ మీట్ లో తల్లి మాట్లాడేది.. బాలిక తల్లిదండ్రులు ఇతని పూర్తిగా నమ్మ‌డంతో ఇదే అదునుగా ఇతనికి ఉన్న అప్పులు ఇతర ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు బాలిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగులు కావడంతో డబ్బు బంగారం దొంగలించాలనే దురుద్దేశంతో ఇంతటి ఘాతుకానికి ఒడి కట్టాడని కోన‌సీమ ఎస్పీ రాహుల్‌మీనా తెలిపారు. నిందితున్ని రిమాండ్ కు పంపించిన‌ట్లు తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Advertisement

వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam
Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Pawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
Lionel Messi: మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
Embed widget