అన్వేషించండి

PCOS and Breast Cancer : PCOS ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువేనా? పరిశోధనలు ఏమి చెప్తున్నాయంటే

Breast Cancer Risks : PCOS సమస్య ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? పరిశోధనలు, శాస్త్రవేత్తలు చెప్పే విషయాలు ఏంటి? జాగ్రత్తలు తీసుకోకపోతే ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందో చూసేద్దాం.

Link Between PCOS and Breast Cancer : పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఈ రోజుల్లో మహిళల్లో వచ్చే చాలా సాధారణమైన హార్మోన్ల రుగ్మతలలో ఒకటి. ఇది పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పీరియడ్స్ సమయానికి రాకపోవడం, అండాశయ తిత్తులు, ఆండ్రోజెన్‌ల (పురుష హార్మోన్లు) స్థాయిలు పెరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. PCOS తరచుగా ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, దీర్ఘకాలిక మంట వంటి జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఇది ప్రధానంగా సంతానోత్పత్తిపై దాని ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ.. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెప్తున్నారు డాక్టర్ పంకజ్ గోయల్. 

PCOS, రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధమిదే

PCOS, రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధం ఎక్కువగా హార్మోన్ల అసమతుల్యతతో ముడిపడి ఉంది. PCOS ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దానిని సమతుల్యం చేయడానికి తగినంత ప్రొజెస్టరాన్ ఉండదు. దీనివల్ల రొమ్ము కణాలు సాధారణంగా కంటే ఎక్కువగా పెరగడానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు ఇలాంటి అసాధారణ మార్పులు జరుగుతాయి. అదనంగా ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ హార్మోన్లు, పెరుగుదల కారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది రొమ్ములో కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

పరిశోధన ఫలితాలివే

PCOS, రొమ్ము క్యాన్సర్​ మధ్య సంబంధంపై ఇప్పటివరకు చేసిన పరిశోధనలు ఏకాభిప్రాయ ఫలితాలు ఇవ్వలేదు. కానీ కొన్ని అధ్యయనాలు PCOS ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం స్వల్పంగా పెరిగిందని సూచిస్తున్నాయి. మరికొన్ని పరిశోధనల్లో ఇవి కనిపించలేదు. బరువు, వయస్సు, జన్యుశాస్త్రం, పునరుత్పత్తి చరిత్రలో వ్యత్యాసాల కారణంగా ఈ వ్యత్యాసం ఉండవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. అలా చూస్తే.. PCOS,రొమ్ము క్యాన్సర్ రెండింటికీ ఊబకాయం, నిశ్చలమైన జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక ప్రమాద కారకాలు కారణమవుతున్నాయని తెలిపారు.

PCOS ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

PCOS నిర్ధారణ అయిన మహిళలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడం వల్ల హార్మోన్ల స్థాయిలను నియంత్రించవచ్చు. క్రమం తప్పకుండా రొమ్ము స్వీయ-పరీక్షలు, 40 ఏళ్లు పైబడితే సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రారంభ దశలోనే కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. దానిలో రొమ్ము క్యాన్సర్ కూడా ఒకటి. 

PCOS నేరుగా రొమ్ము క్యాన్సర్‌కు కారణం కానప్పటికీ.. జీవక్రియ, హార్మోన్ల వల్ల దీని వ్యాప్తి మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. PCOS ఉన్న మహిళలు తమ ఆరోగ్యం గురించి తెలుసుకునేలా, సకాలంలో వైద్య సలహా తీసుకునేలా చూడాలని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్​లో సీనియర్ కన్సల్టెంట్​గా చేస్తోన్నా డాక్టర్ పంకజ్ గోయల్ తెయిపారు. ఇలా చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ నివారణ చేయవచ్చని చెప్తున్నారు. అలాగే శరీరంలో మార్పులు గమనిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget