World Immunization Day : టీకాలతో భయంకరైన వ్యాధులు దూరం.. వ్యాక్సిన్స్‌తో పాటు సహజంగా ఇమ్యూనిటీని పెంచే మార్గాలివే
Importance of Vaccination : భయంకరమైన వ్యాధులను దూరం చేసుకోవాలంటే ఇమ్మూనిటీని పెంచే వాక్సిన్స్ కచ్చితంగా తీసుకోవాలి. దీనిపై అవగాహన కల్పిస్తూ వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే నిర్వహిస్తున్నారు.

World Immunization Day 2025 : టీకాల ప్రాముఖ్యతను గుర్తించి.. ప్రతి సంవత్సరం దానిపై అవగాహన కల్పించేందుకు వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే(ప్రపంచ రోగనిరోధక దినోత్సవం) నిర్వహిస్తున్నారు. భయంకరమైన వ్యాధులు రాకుండా టీకాలు తీసుకోవాలని అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. అయితే ఈ స్పెషల్ డేని ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారు? టీకాలు వేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
ప్రపంచ రోగనిరోధక దినోత్సవం చరిత్ర
World Immunization Dayని ప్రతి సంవత్సరం నవంబర్ 10న జరుపుకుంటారు. స్మాల్ పాక్స్, పోలియో వంటి అనేక భయంకరమైన వ్యాధులను పూర్తిగా నియంత్రించడానికి వ్యాక్సినేషన్స్ ఉపయోగపడుతుందనే అంశాన్ని ప్రజలకు చెప్పేందుకు దీనిని ప్రారంభించారు. వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఈ స్పెషల్ డేని ప్రోత్సాహిస్తున్నాయి.
టీకాలపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచేందుకు WHO, UNICEF వంటి సంస్థలు vaccination coverage పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టాయి. అందుకే ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై అవహగాన పెరిగింది.
టీకాలు ఎందుకు అవసరం?
మన శరీరాన్ని ప్రమాదకరమైన వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి రక్షించుకోవడానికి వ్యాక్సిన్లు అవసరం. టీకాలతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు రక్షించగలిగారు. అందుకే అప్పుడే పుట్టిన పిల్లలు, శిశువులు, ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు కచ్చితంగా వైద్యులు సూచించే వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ రేట్ పెరిగితే.. అందరిలోనూ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల వైరస్ల వ్యాప్తి కంట్రోల్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొవిడ్. ఒకప్పుడు పోలియో ఉదాహరణగా చెప్పేవారు కానీ కరోనా సమయంలో ఈ వ్యాక్సిన్స్ గురించి అందరికీ మంచి అవగాహన వచ్చింది.
ఈ స్పెషల్ డే రోజు చేయాల్సింది ఏమిటంటే..
వరల్డ్ ఇమ్యూనైజేషన్ డేన ప్రజల్లో వ్యాక్సిన్స్‌పై ఉన్న మూఢనమ్మకాలు తీసేయాలి. అలాగే మిస్ లీడ్ చేసే డౌట్స్ క్లియర్ చేయాలి. వ్యాక్సిన్లు వేయించుకోవడంపై అవగాహన కల్పిస్తూ ఉండాలి. వ్యాక్సిన్ల గురించి సరైన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. టీకాలతో దూరం చేసుకోగలిగే వ్యాధుల గురించి వివరించి చెప్పి.. వాక్సిన్స్ తీసుకునే విధంగా ప్రోత్సాహించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాక్సినేషన్ షెడ్యూల్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. టైమ్ టూ టైమ్ కంప్లీట్ చేయాలి. వాక్సిన్ తీసుకునే ముందు తర్వాత కూడా వైద్యుల సూచనలు ఫాలో అవ్వాలి. తెలియని ప్రదేశాల్లో, అప్రూవ్ చేయాలేని కేంద్రాల వద్ద టీకాలు తీసుకోకపోవడమే మంచిది. టీకా తీసుకున్న తర్వాత ఏదైనా రియాక్షన్ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రెగ్నెన్సీతో ఉండేవారు, నవజాత శిశువులు టీకా వేయించుకునే ముందు వైద్యుల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి.
ఇమ్యూనిటీ సహజంగా పెంచుకోవాలంటే
రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. ఇమ్యూనిటీ పెంచుకుంటే చాలావరకు వ్యాధులు దూరమవుతాయి. సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, నట్స్ తీసుకోవాలి. 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించేందుకు మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. వ్యాయామం చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. శరీరానికి కావాల్సిన నీటిని అందించాలి. వీటిని ఫాలో అయితే పూర్తి ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ సొంతం అవుతుంది.






















