అన్వేషించండి

Alzheimers Breakthrough : అల్జీమర్స్​కి ఇక చెక్.. మరిచిపోయిన జ్ఞాపకాలు తిరిగిపొందవచ్చా? న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు

Alzheimers Research : అల్జీమర్స్ సమస్యకు ఇక చెక్ పెట్టేయొచ్చు. మరిచిపోయిన గతాన్ని గుర్తుతెచ్చేయవచ్చని చెప్తున్నాయి తాజా పరిశోధనలు. ఇది ఎంతవరకు నిజమో చూసేద్దాం. 

Alzheimers Reverse and Memory Recovery : వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. వివిధ కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల ఇది వస్తుంది. ఇది వస్తే మెదడులో బ్రెయిన్ సెల్స్ ఆటోమెటిక్​గా డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల మెమరీ తగ్గిపోతుంది. రోజూవారీ చేసే పనులు సామర్థ్యం తగ్గిపోయేలా చేస్తుంది ఈ న్యూరో డిజెనరేటివ్ డిజార్డర్. అయితే దీనికి పర్మినెంట్ సొల్యూషన్ లేదు కానీ.. తగ్గించేందుకు కొన్ని లైఫ్​స్టైల్​లో మార్పులు, వైద్యుల సూచనలు ఫాలో అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు తాజా పరిశోధనలు అల్జీమర్స్​కి బ్రేక్​త్రూని కనిపెట్టాయి. 

అల్జీమర్స్​కి కారణాలు..

అల్జీమర్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మెదడులో బీటా-అమీలాయిడ్ అనే ప్రోటీన్ ఎక్కువమోతాదులో పెరిగి.. ప్లాక్స్​గా ఏర్పడుతుంది. దీనివల్ల నరాల మధ్య కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఇది మెమరీలాస్​కు ప్రధాన కారణంగా చెప్తారు. అలాగే మెదడులో టావ్ ప్రోటీన్ అబ్నార్మల్‌గా మారి బ్రెయిన్ సెల్స్ ట్రాన్స్​పోర్టేషన్​ని సిస్టమ్​ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ చనిపోయి అల్జీమర్స్ రావచ్చు. 

ఆరోగ్య పరమైన సమస్యలు కూడా

కొందరిలో జెనిటికల్​గా వస్తుంది. వయసు పెరిగేకొద్ది వచ్చే ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. హై బీపీ, ఒబెసిటీ, డయాబెటిస్, స్మోకింగ్ చేయడం, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ వంటి లైఫ్​స్టైల్ అల్జీమర్స్ రిస్క్​ని పెంచుతాయి. ఇన్​ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు కూడా నరాలు దెబ్బతింటాయి. తలకు గాయాలు వంటివి జరిగినప్పుడు మెమరీ లాస్ అవ్వచ్చు. 

పరిశోధనలో అద్భుత ఫలితాలు.. 

ఈ అల్జీమర్స్​ చికిత్సపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో ఏర్పడే హానికరమైన “అమీలాయిడ్ ప్లాక్”లను తొలగించే ట్రీట్‌మెంట్​పై పరిశోధన చేయగా.. అది విజయవంతమైనట్లు తెలిపారు. మెమరీ లాస్‌కు ప్రధాన కారణమైన దీనిని జయించినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా ల్యాబ్ టెస్టుల్లో తీసిన బ్రెయిన్ స్కాన్స్‌లో Before-After గా ప్లాక్ గణనీయంగా తగ్గినట్టు కనిపించిందని పేర్కొన్నారు.

అల్జీమర్స్​ను ఆలస్యం చేస్తుందట

బ్రెయిన్​లోని ఈ ప్రోటీన్ ప్లాక్‌లు బీటా-అమీలాయిడ్ ప్రోటీన్స్‌తో తయారై.. మెదడు నరాల మధ్య కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తాయి. అందుకే మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. దీనిని తగ్గించేందుకు Leqembi (Lecanemab) అనే ఔషధాన్ని ఉపయోగించారు. దీనికి FDA ఆమోదం కూడా లభించింది. ఇది ప్రారంభ దశ అల్జీమర్స్‌ ప్రోగ్రెషన్‌ను slow చేసి.. మెదడులోని ఈ ప్లాక్​లను శుభ్రం చేయడంలో సహాయపడుతోంది.

మరెన్నో పద్ధతులు

CRISPR జీనె ఎడిటింగ్, అల్ట్రాసౌండ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి పద్ధతులు కూడా క్లినికల్ ట్రయల్స్‌లో శక్తివంతమైన రిజల్ట్స్ చూపిస్తున్నాయని తెలిపారు. అయితే ఇది పూర్తి నివారణి కాదు అని.. కానీ అల్జీమర్స్ తగ్గించడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని ముందుగా గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే మంచిఫలితాలు చూడవచ్చని చెప్తున్నారు. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget