Top Headlines Today: షర్మిలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు; చంద్రబాబును కలవనున్న షర్మిల! - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
షర్మిల ఏపీ కాంగ్రెస్ నాయకురాలు
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాను స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని రెండు రోజుల కాంగ్రెస్ లో విలీనం చేస్తూ వైఎస్ షర్మిల (YS Sharmila) హస్తం గూటికి చేరారు. అయితే షర్మిలను ఎన్నికల ముందు తెలంగాణ నేతలు పదే పదే అన్నమాట నువ్వు ఏపీకి చెందిన వ్యక్తివి. కావాలంటే మీ సోదరుడు జగన్ అరాచక పాలనపై పోరాటం చేసి, ఏపీలో రాజన్న రాజ్యం తేవాలని సూచించే వారు. ఇంకా చదవండి
రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడిదే హాట్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలిశారు వైఎస్ షర్మిల. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం విశేషం. అయితే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక, వివాహానికి రావాల్సిందిగా ఆమె, సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయనకు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం షర్మిల భేటీ కానున్నారని సమాచారం. ఇంకా చదవండి
అడిగిమరీ వచ్చి అలిగి వెళ్లిపోయిన అంబటి రాయుడు!
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏం మారలేదు. క్రికెట్లో ఎలాగున్నాడో రాజకీయాల్లోనూ అంతే. వైసీపీ (YSRCP)లో చేరిన వారంలోనే అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్ (Ambati Rayudu Resigned to YSRCP) అయ్యాడు. అడిగి మరీ వచ్చిన అంబటి అసలెందుకు వెళ్లిపోయాడు...? ఇంకా చదవండి
వైసీపీలోకి వీవీ వినాయక్! ఆ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి స్టార్ డైరెక్టర్!
అభ్యర్థుల మార్పులపై షాకుల మీద షాకులు ఇస్తున్న YSRCP ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ మార్పు చేయబోతోంది. ఒకప్పటి స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ (VV Vinayak)ను తీసుకొస్తోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి ఆయన పేరు ఖరారు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో 25కు 22 లోక్‌సభ సీట్లు సాధించినప్పటికీ చాలామంది పార్లమెంట్ సభ్యులను పక్కకి తప్పించారు. ఇఫ్పటికే ఆరుగురు ఎంపీలకు స్థాన చలనం కల్పించారు. ఇంకా చదవండి
స్టాన్‌ఫోర్డ్ లో చదివిన లోకేష్‌కు ఎస్మా తెలుసా?
తల్లిని, చెల్లిని గెంటేసిన ఏపీ సీఎం జగన్‌కు అంగన్వాడీల సమస్యలు ఎలా తెలుస్తాయని టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) చేసిన ట్వీట్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. లోకేష్ వాళ్ల తాత దివంగత ఎన్టీ రామారావుకు తండ్రి చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యాడు, అలాంటిది లోకేష్ సీఎం జగన్ మీద కామెంట్లు చేయడం ఏంటని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం కాదు.. తాతను తండ్రి వెన్నుపోటు చంపారని విషయం లోకేష్ కు తెలిసి ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని హితవు పలికారు. ఇంకా చదవండి
భోపాల్‌లోని వసతి గృహంలో 26 మంది బాలికల మిస్సింగ్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బాలికల గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. అనేక రాష్ట్రాలకు చెందిన బాలికలు ఆ వసతి గృహంలో ఉంటున్నారు. ఆ బాలికల వసతి గృహాన్ని అక్రమంగా నిర్వహిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా చదవండి
దిల్ రాజుపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం
సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల విషయంలో ఫిలిం ఛాంబర్ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ చేతుల్లో పెట్టుకుని నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంకా చదవండి
శ్రీలీలలా అవకాశాలు ఎందుకు రావడం లేదు? జరల్నిస్ట్ ప్రశ్నకు అంజలి ఘాటు వ్యాఖ్యలు
తెలుగమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావని, వారిని చిన్నచూపు చూస్తారని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అంజలి పరిస్థితి కూడా అదే అని, అందుకే తెలుగులో ఎక్కువగా సినిమాల్లో తను కనపించడం లేదని చాలామంది భావిస్తున్నారు. తాజాగా తన నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ప్రెస్ మీట్‌లో కూడా అదే జరిగింది. ఒక జర్నలిస్ట్.. తనకు అంజలి అంటే అభిమానం అని చెప్తూనే.. హీరోయిన్ శ్రీలీల తరహాలో అవకాశాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. తెలుగులో ఇంకా బ్రేక్ రాలేదని వ్యాఖ్యనించింది. దీంతో అంజలి ఘాటుగా స్పందించింది. తన గత హిట్ సినిమాల గురించి గుర్తుచేసింది. భవిష్యత్తులోని ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఇంకా చదవండి
సంపద సూత్రాలు చెప్పిన వ్యక్తికి వేల కోట్ల అప్పు
'రిచ్ డాడ్, పూర్ డాడ్' పుస్తకం గురించి పరిచయం అక్కర్లేదు. డబ్బు సంపాదించడం, దానిని సంపదగా మార్చడం ఎలాగో చెప్పే పుస్తకం అది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లోకి తుర్జుమా అయింది, ప్రతి చోటా సెన్సేషన్ సృష్టించింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన బుక్స్‌లో 'రిచ్ డాడ్, పూర్ డాడ్' (Rich Dad Poor Dad Book) ఒకటి. ఇంకా చదవండి
ముగిసిన వార్నర్ శకం, ఆసీస్ క్రికెట్‌లో డేవిడ్ భాయ్ ఓ అద్భుతం
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టులకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ భాయ్ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్‌పై వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) గెలిచిన మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. ఇంకా చదవండి
సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?
వెన్నం జ్యోతి సురేఖ (Jyothi Surekha) దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు( Major Dhyan Chand Khel Ratna award)కు తనను ఎంపిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపధ్యంలో కోర్ట్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. ఇంకా చదవండి