Anjali: శ్రీలీలలా అవకాశాలు ఎందుకు రావడం లేదు? జరల్నిస్ట్ ప్రశ్నకు అంజలి ఘాటు వ్యాఖ్యలు
Anjali: ‘వకీల్ సాబ్’ తర్వాత తెలుగు తెరపై కనుమరుగయిపోయింది తెలుగమ్మాయి అంజలి. అదే విషయంపై క్లారిటీ ఇస్తూ తెలుగు సినిమాలు చేయకపోయినా తాను ఎప్పుడూ బిజీగా ఉన్ననని చెప్పుకొచ్చింది.
Anjali about Acting in Telugu Movies: తెలుగమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావని, వారిని చిన్నచూపు చూస్తారని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అంజలి పరిస్థితి కూడా అదే అని, అందుకే తెలుగులో ఎక్కువగా సినిమాల్లో తను కనపించడం లేదని చాలామంది భావిస్తున్నారు. తాజాగా తన నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ప్రెస్ మీట్‌లో కూడా అదే జరిగింది. ఒక జర్నలిస్ట్.. తనకు అంజలి అంటే అభిమానం అని చెప్తూనే.. హీరోయిన్ శ్రీలీల తరహాలో అవకాశాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. తెలుగులో ఇంకా బ్రేక్ రాలేదని వ్యాఖ్యనించింది. దీంతో అంజలి ఘాటుగా స్పందించింది. తన గత హిట్ సినిమాల గురించి గుర్తుచేసింది. భవిష్యత్తులోని ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇచ్చింది.
నేను నెంబర్ గేమ్ ఆడను..
‘‘బ్రేక్ రాకపోతే మీకు నేను ఫెవరేట్ హీరోయినే అవ్వను’’ అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది అంజలి. అంతే కాకుండా తనను శ్రీలీలతో పోలుస్తుండగా మధ్యలో జోక్యం చేసుకొని ‘‘నేనెప్పుడూ ఈ నెంబర్ 1, నెంబర్ 2 అనే ఆట ఆడలేదు. ఇంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. టాప్, సెకండ్ టాప్ అనేవి మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. నాకు ఒక హీరోయిన్ నచ్చొచ్చు. మీకు ఒక హీరోయిన్ నచ్చొచ్చు. ఈయనకు ఒక హీరోయిన్ నచ్చొచ్చు. ముగ్గురూ ఒక్కరే అవ్వాలన్న రూల్ లేదు. అందుకే ఇది నెంబర్ గేమ్‌కు సంబంధించింది కాదు. నాకు ప్రాధాన్యత ఉండి, నేను దాంతో ఏమైనా నిరూపించుకోవచ్చు అన్న కథలను మాత్రమే ఎంచుకుంటాను. అలా లేకపోతే నేను అసలు ఆ పాత్రను ఎంచుకోను’’ అని క్లారిటీ ఇచ్చింది అంజలి.
నాలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నాను..
‘‘ఒక యాక్టర్‌గా ఆ పాత్ర ముందు నన్ను తృప్తిపరచాలి. నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. ఒకేసారి ఒక సినిమాపైనే దృష్టిపెట్టొచ్చు. ఇది నెంబర్లకు సంబంధించి కాదు. కానీ ఒకేసారి ఒక మంచి సినిమా చేయాలి అన్నదే నా లక్ష్యం. ఇప్పుడు నేను నాలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నాను. మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నేను ఒక మనిషినే అన్నిచోట్లా ఉండలేను. ఈరోజు నేను తెలుగులో పనిచేస్తే.. తరువాత నేను తమిళంలో పనిచేయాలి. తమిళంలో ఒకసారి బ్రేక్ వస్తుంది. తెలుగులో ఒకసారి బ్రేక్ వస్తుంది. అందుకే నాకు స్ఫూర్తినిచ్చే పాత్రలను, నాకు కిక్ ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుంటాను’’ అంటూ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడింది అంజలి.
ప్రతీరోజూ పనిచేస్తున్నాను..
‘‘మనకు ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఓటీటీలో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఓటీటీలో నాకు రెండు రిలీజ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా తెలుగులో రెండు సీజన్లు, తమిళంలో ఒక సీజన్, మలయాళంలో ఇరట్టా అనే పెద్ద మూవీ రిలీజ్ అయ్యింది. వకీల్ సాబ్ తర్వాత నాకు గత కొన్నేళ్లలో ఎన్నో రిలీజ్‌లు ఉన్నాయి. నేను కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నాను. తెలుగు మూవీ లేట్ అవుతుందని పనిచేయడం లేదని కాదు. నేను ప్రతీరోజూ పనిచేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కూడా నాలుగు రోజుల ముందు చెప్పారు. లేకపోతే నేను వేరే పనిలో బిజీగా ఉండుంటాను’’ అని తన గత రిలీజ్‌ల గురించి గుర్తుచేసింది అంజలి.
Also Read: ‘చిత్రం’ బ్యూటీ ఫ్యామిలీ పిక్ - రీమా సేన్ పిల్లలు, భర్తను చూశారా?