Tek Fog BJP : నిన్న పెగాసస్.. నేడు టెక్ ఫాగ్..! బీజేపీపై మళ్లీ తీవ్రమైన ఆరోపణలు..
దేశంలో పెగాసస్ స్పైవేర్ దుమారం ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇప్పుడు టెక్ ఫాగ్ అనే యాప్‌పై దుమారం రేగుతోంది. ఇది కూడా బీజేపీ పనేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దేశంలో పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖులపై నిఘా పెట్టిన అంశం గురించి పూర్తి స్థాయి వివరాలు బయటకు రాక ముందే మరో సంచలనాత్మకమైన యాప్ విషయంలో దుమారం ప్రారంభమైంది. "టెక్ ఫాగ్ యాప్"తో భారతీయ జనతా పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని విప్కషాలు ఆరోపిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్ ఫాగ్ యాప్‌తో ముప్పు పొంచి ఉందని ..ఈ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ కావాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేస్తోంది.
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఏమిటీ ఈ టెక్ ఫాగ్ యాప్ !
బీజేపీ ఐటీ సెల్‌తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు టెక్ ఫాగ్ యాప్‌ను ఉపయోగించి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రెడింగ్‌లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. బిజెపికి అనుబంధంగా ఉన్న రాజకీయ కార్యకర్తలు.. పార్టీ ప్రజాదరణ కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగిస్తున్న రహస్య యాప్ 'టెక్ ఫాగ్' ఉనికిని కొంత మంది బయట పెట్టారు. ఈ యాప్‌లో బిజెపిపై విమర్శలు చేస్తున్న వారిని వేధించడం, ప్రజల అభిప్రాయాలను తారుమారు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తోంది. ఈ యాప్ పలు ఫ్లాట్‌ఫారమ్‌లో కథనాలను భారీగా మార్చడానికి, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్‌లకు చొచ్చుకుపోవడమే కాకుండా, సోషల్ మీడియా సందేశాలను భద్రత పర్చడం వంటి సామర్థ్యాన్ని కల్గి ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
టెక్ ఫాగ్ ఎలా పని చేస్తుంది ?
టెక్ ఫాగ్ యాప్ సొంతంగా ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలు క్రియేట్ చేస్తుంది. రీట్వీట్లు, ఫేస్‌బుక్‌లో పోస్టులను ఆటోమేటిక్‌గా షేర్ చేస్తుంది. ముందుగా టైప్ చేసి పెట్టిన సందేశాలతో ఆటోమేటిక్‌గా రిైప్లెలు ఇస్తుంది. క్రియాశీలకంగా లేని వాట్సాప్ నంబర్లను హైజాక్ చేస్తుంది. టోకెన్ థెఫ్ట్ అనే సాంకేతికత ద్వారా ఆ నంబర్ల నుంచి సందేశాలు పంపిస్తుంది. క్రియాశీలకంగా లేని వాట్సాప్ నెంబర్లను టెక్‌ఫాగ్ యాప్ గుర్తిస్తుంది.
బీజేపీ మాత్రమే ఉపయోగిస్తోందా ?
బీజేపీ ఐటీ సెల్ ఒక్కటే కాకుండా, భారతీయ జనతా యువమోర్చా కూడా టెక్ ఫాగ్ యాప్ వాడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్తి శర్మ పేరుతో ఒకరు బీజేపీ ఐటీ సెల్‌లో పనిచేశాననిచెబుతూ వివరాలన్నీ బయట పెట్టారు. తానుటెక్ ఫాగ్ అనే యాప్‌ను వాడానని ఇది సెక్యూరిటీ ఫీచర్స్‌ను దాటుకొని సందేశాలు పంపుతుంది. హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తుంది. ఆర్తి శర్మ08 అనే ట్విట్టర్ అకౌంట్లలో తెలిపారు. 67 మంది యాప్ ఆపరేటర్లు ఎలా వాట్సాప్ నెంబర్ల నుంచి సందేశాలు పంపిస్తున్నారో ఆర్తి స్క్రీన్ షాట్లు పోస్ట్ చేశారు. దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ లేదా సంస్థ ఈ టెక్ యాప్ వాడుతున్నట్లుగా స్పష్టతలేదు. కానీ బీజేపీపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి
ఈ అంశంపై బీజేపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కేంద్రం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. టెక్ ఫాగ్ యాప్ గురించి జరుగుతున్న ప్రచారం నిజం అయితే పౌరుల భద్రతకు భంగం వాటిల్లే కార్యకలాపాలకు అనుమతించినట్లేనన్న ఆరోపణలు వెల్లుతున్ాయి. పెగాసస్ తరహాలోనో టెక్ ఫాగ్ యాప్ కూడా వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది.
Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.