By: ABP Desam | Updated at : 27 Oct 2021 06:53 PM (IST)
Edited By: Murali Krishna
వాంఖడేపై దర్యాప్తు షురూ
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎన్‌సీబీ సీనియర్ అధికారి సమీర్ వాంఖడే వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. అనంతరం ఎన్‌సీబీ నియమించిన ఐదుగురు దర్యాప్తు కమిటీలో ఒకరైన డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ వాంఖడే స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు వెల్లడించారు.
అయితే అంతకుముందే ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్‌సీబీ ఆఫీసు నుంచి కీలక డాక్యుమెంట్లు, రికార్డింగ్‌లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వాంఖడేపై ఆరోపణలు చేసిన ప్రభాకర్ సాలీని ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ ప్రత్యేక బృందం సమన్లు జారీ చేయనుంది. ఇప్పటికే వాంఖడేపై ముంబయిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. అయితే తనపై వస్తోన్న ఆరోపణలను వాంఖడే ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
All the allegations levelled against me are false: NCB Mumbai Zonal Director Sameer Wankhede after appearing before a 5-member team of the agency in Mumbai https://t.co/0kBfKrX5mN pic.twitter.com/8wWC8U4cdD
— ANI (@ANI) October 27, 2021
నాలుగు గంటల పాటు..
ముంబయి డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాలీని ఎన్‌సీబీ అధికారులు నిన్న అర్ధరాత్రి వరకు విచారించారు. దాదాపు 4 గంటల పాటు అతడ్ని ప్రశ్నించారు అధికారులు.
విచారణ అనంతరం ప్రభాకర్ సాలీ వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేసినట్లు సమాచారం. అతడు చెప్పిన సమాచారం మేరకు తదుపరి దర్యాప్తును అధికారులు కొనసాగిస్తున్నారు.
కిరణ్ గోసవీ బాడీగార్డ్ అయిన ప్రభాకర్ సాలీ ఇటీవల ఎన్‌సీబీ సీనియర్ అధికారి సమీర్ వాంఖడేపై సంచలన ఆరోపణలు చేశారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టేందుకు వాంఖడే రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించాడు. ఆ తర్వాత ఎన్‌సీబీ అధికారులు ప్రభాకర్‌ను ప్రశ్నించేందుకు ఇటీవల సమన్లు జారీ చేశారు.
Also Read: China Land Boundary Law: 'చైనా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.. సరిహద్దులో హిస్టరీ రిపీట్ అవుద్ది'
Also Read: WHO ON Covaxin: మళ్లీ అదే కథ.. కొవాగ్జిన్ అనుమతిపై మారని డబ్ల్యూహెచ్ఓ తీరు!
Also Read: Aryan Khan Drug Case: డ్రగ్స్ కేసులో కీలక సాక్షిని 4 గంటల పాటు ప్రశ్నించిన ఎన్‌సీబీ!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు, 585 మరణాలు నమోదు
Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!
Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Guntur News : వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి, రోడ్డుపై బైఠాయించిన ఓ కుటుంబం
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
Secunderabad Bjp Meeting : బీజేపీ విజయసంకల్ప సభ, భారీగా తరలివచ్చిన శ్రేణులు, హాజరైన ప్రజాగాయకుడు గద్దర్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు
Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?