Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!

పంజాబ్‌లో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ త్వరలోనే తాను కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.

FOLLOW US: 

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్.. కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీతో పంజాబ్ ప్రజల ముందుకు వస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరు, గుర్తుపై వివారాలను త్వరలో వెల్లడిస్తానన్నారు. దీనిపై ఇప్పటికే ఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

" నేను కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. పార్టీ పేరు, గుర్తు త్వరలోనే ప్రకటిస్తా. పార్టీ ఏర్పాటుకు కావాల్సిన పనులను మా వాళ్లు చూస్తున్నారు. సమయం వస్తే మొత్తం 117 సీట్లలోనూ పోటీ చేస్తాం. అయితే భాజపాతో పొత్తు కుదిరితే అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇక నవజోత్ సింగ్ సిద్ధూ విషయానికి వస్తే అతను ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మేం బరిలో ఉంటాం. పంజాబ్ హోంమంత్రిగా నేను 9.5 సంవత్సరాలు పనిచేశా. ఒక నెల హోంమంత్రిగా ఉన్న వ్యక్తి.. నాకంటే తనకే ఎక్కువ తెలుసని చెప్పుకుంటున్నారు. కల్లోలిత పంజాబ్ ఎవరికీ అవసరం లేదు. రాష్ట్రంలో కఠిన పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి.                                             "
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం

అన్ని హామీలు..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తన హయాంలోనే నెరవేరాయని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. 92 శాతం హామీలు తన హయాంలోనే పూర్తయ్యాయని వివరించారు. తాను చేపట్టిన భద్రతా చర్యలను విమర్శించడాన్ని తప్పుబట్టారు. పంజాబ్ రాజకీయం గత నెలరోజుల నుంచి రోజుకో మలుపు తిరుగుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తనను అవమానించారని అమరీందర్ సింగ్.. రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌పై విమర్శలు కురిపించారు.

Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్‌'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు

Also Read: Huzurabad By Election: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ

Also Read: Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Oct 2021 12:27 PM (IST) Tags: amarinder singh punjab congress punjab news amarinder Amarinder Singh New Party

సంబంధిత కథనాలు

Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు

Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు

Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

Defence Ministry:  ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

DRDO : త్వరలో మేడిన్ ఇండియా మానవ రహిత యుద్ధ విమానాలు - డీఆర్డీవో లెటెస్ట్ సక్సెస్ స్టోరీ ఇదిగో

DRDO :  త్వరలో మేడిన్ ఇండియా మానవ రహిత యుద్ధ విమానాలు -  డీఆర్డీవో లెటెస్ట్ సక్సెస్ స్టోరీ ఇదిగో

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా

టాప్ స్టోరీస్

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 2nd July  2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

BJP PLenary Plan On TRS : తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే

BJP PLenary Plan On TRS :  తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే