News
News
X

China Land Boundary Law: 'చైనా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.. సరిహద్దులో హిస్టరీ రిపీట్ అవుద్ది'

చైనా తెచ్చిన కొత్త సరిహద్దు చట్టంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు సరిహద్దులో శాంతి, సుస్థిరతలను దెబ్బతీస్తాయని భారత్ పేర్కొంది.

FOLLOW US: 

చైనా తీసుకువచ్చిన కొత్త సరిహద్దు చట్టంపై భారత్ తొలిసారి స్పందించింది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో కొత్త సరిహద్దు చట్టాన్ని రూపొందించిన చైనాకు దీటుగా బదులిచ్చింది. బీజింగ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. 

" వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతల కోసం ఇప్పటికే చైనాతో పలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాం. కానీ ఇలా ఏకపక్షంగా సరిహద్దు ఒప్పందాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న చట్టాన్ని చైనా ఆమోదించడం ఆందోళనకరం. ఈ చట్టం ప్రకారం సరిహద్దులో చైనా ఎలాంటి చర్యలు చేపట్టకూడదని భారత్ ఆశిస్తోంది. ఎందుకంటే అలా చేస్తే సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.                                                   "
-   అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి

చైనా-పాకిస్థాన్ 1963లో చేసుకున్న సరిహద్దు ఒప్పందంపై భారత్​కు ఉన్న అభిప్రాయాన్ని నూతన చట్టం తొలగించలేదని బాగ్చి అన్నారు. ఈ ఒప్పందాన్ని భారత్ ఇప్పటికీ అక్రమంగానే భావిస్తోందని తెలిపారు.

చట్టంలో ఏముంది?

సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు చైనా ఈ చట్టంలో పేర్కొంది. సరిహద్దులో చైనా ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహిస్తామని డ్రాగన్ చట్టంలో పేర్కొంది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకుంటామని వెల్లడించింది. 

భారత్‌పై ప్రభావం..

ఈ చట్టంతో భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటీవల తూర్పు లద్దాఖ్ వద్ద చైనా- భారత్ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇలాంటి చట్టాలతో డ్రాగన్ ముందుకు వెళితే గల్వాన్ వంటి ఘర్షణలు మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

భూటాన్‌తో..

12 పొరుగు దేశాలతో చైనా సరిహద్దును నిర్ణయించుకుంది. కానీ భారత్, భూటాన్‌తో మాత్రం చైనాకు ఇప్పటికీ సరైన సరిహద్దు లేదు. భారత్‌తో 3,488 కిమీ, భూటాన్‌తో 400 కిమీ మేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది.

Also Read: WHO ON Covaxin: మళ్లీ అదే కథ.. కొవాగ్జిన్‌ అనుమతిపై మారని డబ్ల్యూహెచ్ఓ తీరు!

Also Read: Aryan Khan Drug Case: డ్రగ్స్ కేసులో కీలక సాక్షిని 4 గంటల పాటు ప్రశ్నించిన ఎన్‌సీబీ!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు, 585 మరణాలు నమోదు

Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!

Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్‌'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Oct 2021 05:32 PM (IST) Tags: LaC Arindam Bagchi MEA official spokesperson Land Boundary Law the Ministry of External Affairs border management boundary question India-China border China Pakistan Boundary Agreement

సంబంధిత కథనాలు

Bilkis Bano :

Bilkis Bano : "బిల్కిస్ బానో" కేసు దోషులందరూ రిలీజ్ - దేశవ్యాప్తంగా విమర్శలు !

Bihar New Cabinet : 16 ఆర్జేడీకి మిగతావి నితీష్ పార్టీకి - బీహార్‌లో మంత్రివర్గ విస్తరణ !

Bihar New Cabinet :  16 ఆర్జేడీకి మిగతావి నితీష్ పార్టీకి - బీహార్‌లో మంత్రివర్గ విస్తరణ !

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

TROUBLE for Tejashwi Yadav : తేజస్వీ యాదవ్‌కు సీబీఐ షాక్ - ఆ కేసు మళ్లీ తెరపైకి !

TROUBLE for Tejashwi Yadav :   తేజస్వీ యాదవ్‌కు సీబీఐ షాక్ - ఆ కేసు మళ్లీ తెరపైకి !

Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!

Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!

టాప్ స్టోరీస్

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?

Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?