WHO ON Covaxin: మళ్లీ అదే కథ.. కొవాగ్జిన్ అనుమతిపై మారని డబ్ల్యూహెచ్ఓ తీరు!
కొవాగ్జిన్ అత్యవసర అనుమతిపై డబ్ల్యూహెచ్ఓ మరోసారి నిర్ణయాన్ని దాటవేసింది. అదనపు సమాచారం కావాలని భారత్ బయోటెక్‌ను కోరింది.
కొవాగ్డిన్ వినియోగ అనుమతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే అనుమతి వస్తుందని అంతా భావించినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ మాత్రం డెసిషన్ మరోసారి పెండింగ్‌లో పెట్టింది. తుది మదింపునకు గాను భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం అవసరమని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం తెలిపింది.
నవంబర్ 3న..
ఈ వారాంతంలో భారత్ బయోటెక్ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం ఆకాంక్షించింది. తుది మదింపునకు నవంబర్ 3న సమావేశం కానుంది.
24 గంటల్లో..
అయితే 24 గంట్లలో కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారిక ప్రతినిధి డాక్టర్ మార్గరైట్ హారిస్ నిన్న విలేకర్లతో తెలిపారు. అయితే డబ్ల్యూహోచ్ఓ మాత్రం అదనపు సమాచారం కావాలని కోరింది.
దేశంలో ఇప్పటికే కోట్లాది మంది కొవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అయితే ఈ టీకా పొందిన వాళ్లు విదేశాలకు వెళ్లడం కష్టతరంగా మారుతోంది. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. చాలా దేశాలు డబ్ల్యూహెచ్ఓ ఇచ్చే ఈ అనుమతులను ఆధారంగా చేసుకుంటున్నాయి. దీంతో కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయులకు విదేశీ ప్రయాణాలు కష్టంగా మారాయి.
కరోనాపై తయారు చేసిన తొలి దేశీయ టీకా కొవాగ్జిన్. ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న సమయంలో కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ తయారు చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కరోనా డెల్టా వేరియంట్లను కూడా సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నట్లు తేలింది.
Also Read: Aryan Khan Drug Case: డ్రగ్స్ కేసులో కీలక సాక్షిని 4 గంటల పాటు ప్రశ్నించిన ఎన్‌సీబీ!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు, 585 మరణాలు నమోదు
Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!
Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి