అన్వేషించండి

Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 

Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. ఆయన కేబినెట్‌లో ఖర్గే , సిద్ధరామయ్య కుమారులకు చోటు కల్పించారు.

Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

కర్ణాటక రాష్ట్రానికి 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం చాలా ప్రత్యేకంగా నిలిచింది. బుధవారం సాయంత్రం సరిగ్గా 4.10 గంటలకు బెంగళూరులోని లోక్‌భవన్‌లో ఉన్న ప్రతిష్టాత్మకమైన గ్లాస్ హౌస్‌ ప్రమాణ స్వీకారానికి వేదికైంది. కర్ణాటక గవర్నర్‌ థావర్ చంద్‌ గెహ్లాట్‌, డీకే శివకుమార్‌ చేత పదవీ ప్రమాణం చేయించారు. 71 ఏళ్ల శివకుమార్, తన చిరకాల కోరిక అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. 

Image

ఈ అధికారి మార్పిడి అకస్మాత్తుగా జరిగింది కాదు. పార్టీ అధిష్ఠానం ముందే నిర్ణయించింది. కాంగ్రెస్ చేపట్టిన నాయకత్వ ఫార్ములాలో భాగంగానే ఇది చోటు చేసుకుంది. గత నెల మే 28వ తేదీన సిద్ద రామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఒప్పందం ప్రకారం శివకుమార్‌కు మార్గం సుగమమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన శివకుమార్ సమర్థతకు దక్కిన గుర్తింపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Image

కేబినెట్‌లో ఎవరెవరు ఉన్నారు?

శివకుమార్‌తోపాటు ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న జీ పరమేశ్వరన్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ జాబితాలో సామాజిక సమీకరణాలు వారసత్వ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Image

సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే కూడా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు కేహెచ్ మునిపయ్య, కేజే జార్జ్, రామలింగారెడ్డి, ఎంపీ పాటిల్‌ వంటి సీనియర్ నేతలంతా శివకుమార్ కేబినెట్‌లో ఉన్నారు. 

Image

రాజ్యాంగం చేతబూని ప్రమాణం

ప్రమాణ స్వీకార సమయంలో శివకుమార్ భారత రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకోవడం చర్చనీయాంశమైంది. చాలా కాలంగా కాంగ్రెస్‌ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రజల్లోకి వెళ్లోంది. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని డిమాండ్ చేస్తోంది. రాహుల్ గాంధీతోపాటు ఆ పార్టీ నేతలు పెట్టిన ప్రెస్‌మీట్‌లో దీని హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు శివకుమార్ కూడా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఏకంగా రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం చర్చకు దారితీసింది. 

Image

ఈ ప్రమాణ స్వీకారానికి జాతీయ స్థాయి నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు వచ్చి శివకుమార్‌కు శుభాకాంక్షలు చెప్పారు. పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న సిద్ధరామయ్య కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చి శివకుమార్‌ను ఆలింగనం చేసుకొని అభినందించారు. 

ట్రబుల్ షూటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు...

డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయం. క్లిష్ట సమయాల్లో పార్టీని ఆదుకోవడంలో సంక్షోభాలను చక్కదిద్దడంలో ఆయన దిట్ట. అందుకే ఆయనను ట్రబుల్ షూటర్ అంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో ఆయన వ్యూహరచన కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు నేరుగా పాలన బాధ్యతలు చేపట్టడం ద్వారా తన కార్యదక్షతను నిరూపించుకోవడానికి పెద్ద ఛాన్స్‌. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Embed widget