అన్వేషించండి

DK Shivakumar: కాంగ్రెస్ దక్షిణాది బాస్ డీకే శివకుమార్ - కర్ణాటక సీఎం పీఠంతో పాటు తెలంగాణను గెలిపించే టాస్క్.. రాహుల్ గాంధీ బిగ్ స్కెచ్!

Congress South Politics : డీకే శివకుమార్ కు రాహుల్ గాంధీ సీఎం పదవితో పాటు దక్షిణాది టాస్క్ కూడా ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఆయన గెలిపించాల్సి ఉంది.

Congress South India Strategy: దక్షిణాది రాజకీయాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు కర్ణాటక పరిణామాలు సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం వెనుక కేవలం కర్ణాటక అధికారం మాత్రమే కాదు.. మొత్తం దక్షిణాదిలో కాంగ్రెస్ పట్టును పదిలం చేసుకోవాలనే ఒక దీర్ఘకాలిక జాతీయ వ్యూహం దాగి ఉంది.  
 
దక్షిణాదిన కాంగ్రెస్‌కు  డీకే  పెద్దన్న 
ప్రస్తుత దేశ రాజకీయ సమీకరణాల్లో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలే ప్రధాన బలాధారంగా నిలిచాయి. తమిళనాడులో  టీవీకే  నేతృత్వంలోని కూటమిలో భాగస్వామిగా ఉంటూ, కేరళలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ , కర్ణాటకలలో సొంతంగా అధికారంలో ఉంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మళ్లీ పుంజుకోవాలన్నా, కేంద్రంలో చక్రం తిప్పాలన్నా ఈ నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి గరిష్టంగా పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడం అత్యంత కీలకం. అందువల్ల ఈ కోటను కాపాడుకునే బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత నమ్మకస్తుడైన డీకే శివకుమార్‌కు అప్పగించింది.

 రాహుల్ గాంధీ వ్యూహాత్మక  టాస్క్ 

గతంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ.. ఎమ్మెల్యేలను కాపాడటంలో, పార్టీకి ఫండింగ్ సమకూర్చడంలో, వ్యూహాత్మక అడుగులు వేయడంలో డీకే శివకుమార్  ఒక ‘వన్-మెన్ ఆర్మీ’లా పనిచేశారు. ఆయనకున్న ఈ రాచకీయ చాణక్యాన్ని, ఆర్గనైజేషన్ స్కిల్స్‌ను గుర్తించే రాహుల్ గాంధీ ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే ఈ పదవి కేవలం బహుమతి మాత్రమే కాదు, ఒక పెద్ద టాస్క్. రాబోయే రెండేళ్లలో  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తక్కువ సమయంలోనే యాంటీ-ఇంకంబెన్సీని తట్టుకుని పార్టీని మళ్లీ గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఆయన భుజాలపై ఉంది.

 సిద్ధరామయ్య ‘షాడో’ను దాటుకుని వెళ్లడం ఎలా? 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ ముందున్న మొదటి సవాల్.. మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గాన్ని సమన్వయం చేసుకోవడం. సిద్ధరామయ్య కర్ణాటకలో అహిందా  కూటమికి బలమైన మాస్ లీడర్. ఆయన క్యాబినెట్ నుంచి తప్పుకున్నా, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. కాబట్టి సిద్ధరామయ్య అనుచరులైన ఎమ్మెల్యేలను అసంతృప్తికి గురిచేయకుండా, మంత్రివర్గ విస్తరణను సజావుగా పూర్తి చేసి, పరిపాలనపై పట్టు సాధించడం డీకే శివకుమార్‌కు కత్తిమీద సామే. ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ, జేడీఎస్ కూటమి తిరుగుబాటుకు స్కెచ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

 తెలంగాణ గెలుపు భారమూ ‘డీకే’ పైనే! 

డీకే శివకుమార్‌కు కేవలం కర్ణాటక బాధ్యతలే కాదు, పొరుగున ఉన్న తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చే ‘పెద్దన్న’ పాత్రను అధిష్ఠానం కేటాయించింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, డీకే శివకుమార్‌కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక నుంచి డీకే అందించిన వ్యూహాత్మక, ఆర్థిక మద్దతు పార్టీ విజయానికి ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచి, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీల వ్యూహాలను చిత్తు చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ జెండాను మళ్లీ ఎగరేసే బాధ్యత డీకే శివకుమార్ తీసుకోవాల్సి ఉంటుంది.

 ఆర్థిక వనరుల సమీకరణ - పార్టీకి మేనేజర్ 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక అత్యంత కీలకమైన ఆర్థిక వనరుగా ఉంది. డీకే శివకుమార్ ఒక సమర్థుడైన బిజినెస్‌మెన్,  ఫండ్‌రైజర్‌గా పేరొందారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు లేదా జాతీయ స్థాయిలో పార్టీకి అవసరమైనప్పుడు అవసరమైన వనరులను సమకూర్చడంలో ఆయన పాత్ర కీలకం. కర్ణాటక ముఖ్యమంత్రిగా అధికారిక హోదా ఉన్నందున, ఆయన భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా నడపగలరని హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. 

ఢిల్లీ పెద్దలు డీకే శివకుమార్‌కు కిరీటం అయితే ఇచ్చారు కానీ, అది ముళ్ల కిరీటమే. వచ్చే రెండేళ్లలో కర్ణాటకలో సొంత ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, ప్రజాదరణ పొందిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే సమయంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ విజయానికి రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలి.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget