డీకే శివకుమార్ జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తేదీపై జ్యోతిష్యుల సూచనలు ఉన్నప్పటికీ, ఆయన ఈ తేదీకే మొగ్గుచూపుతున్నారు.
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar :కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిద్దరామయ్య రాజీనామాతో ప్రారంభమైన ఈ అధికార మార్పిడి, కొత్త కేబినెట్ కూర్పుతో సరికొత్త దశకు చేరుకోనుంది.

- డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, యువకులకు ప్రాధాన్యత.
- గవర్నర్‌ను కలిసిన శివకుమార్, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం అభ్యర్థిత్వ ప్రకటన.
- వయసు, సామాజిక వర్గాల ఆధారంగా కొత్త మంత్రివర్గ కూర్పు ఆలోచన.
- సిద్దరామయ్య కుమారుడికి మంత్రి పదవి, పార్టీలో అంతర్గత సమన్వయానికి ప్రాధాన్యత.
DK Shivakumar Swearing In Ceremony: కర్ణాటక ముఖ్యమంత్రిగా జూన్ 3న ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. తన మార్క్ రాజకీయం చూపించేందుకు యంగ్ టీంను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 50 ఏళ్ల లోపు ఉన్న వారికి తన జట్టులో చోటు ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మంత్రులుగా ఉన్న సీనియర్స్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దీనికి పార్టీ అధిష్ఠానం కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
గవర్నర్‌తో డీకే శివకుమార్ భేటీ
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పదవీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరేందుకు డీకే శివకుమార్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌తో సమావేశమయ్యారు. ఆయన సోదరుడితో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి రిక్వస్ట్ చేశారు. దాదాపు అరగంటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు. మరోవైపు సాయంత్రానికి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎల్పీ లీడర్‌గా డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం ఆ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేస్తారు. అప్పుడే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసే తేదీని లోక్‌భవన్ ప్రకటించనుంది.
యంగ్ టీంతో సిద్ధమవుతున్న డీకేఎస్
జూన్ 3వతేదీన మంచి ముహూర్తం కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. జూన్ 1 లేదా జూన్ 5 బాగుంటుందని డీకే శివకుమార్‌కు సూచించారు. ఆయన మాత్రం జూన్ 3న ప్రమాణం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆయనతోపాటు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. శివకుమార్ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయని. దాదాపు 50 శాతం కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలని అధిష్ఠానం భావిస్తోంది. రాహుల్ గాంధీ సూచన మేరకు కేరళలోని యూడీఎఫ్ తరహాలో 50 ఏళ్ల లోపు వయసు ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కే అవకాశం ఉంది. దళితులు, ఎస్టీ, బీసీలు, లింగాయత్ సామాజిక వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పిస్తారు. నలుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
సిద్దరామయ్య కొడుక్కి మంత్రి పదవి
సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్యకు కీలకమైన మంత్రిపదవి దక్కడం ఖాయం. ఇప్పటికే మంత్రులుగా ఉన్న హెచ్‌సీ మహదేవప్ప, జీ పరమేశ్వర, కేజే జార్జ్ వంటి సీనియర్లను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
రికార్డును బ్రేక్ చేస్తారా?
గత నాలుగు దశాబ్దాలుగా కర్ణాటకలో ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను చెరిపేసి, 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించడం శివకుమార్ ముందున్న అతి పెద్ద సవాల్. పాలనలో తనదైన ముద్ర వేయడంతోపాటు సిద్ధరామయ్య వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లడం డీకేఎస్‌కు పరీక్ష కానుంది.
ఈ అధికార మార్పిడి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సిద్ధరామయ్య మూడేళ్లు, శివకుమార్ రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ ఒప్పందానికి కట్టుబడి పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సిద్ధరామయ్య మే 28న తన రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు పంపించారు. రాహుల్ జోక్యం చేసుకొని జాతీయ రాజకీయాల్లోకి రావాలని సిద్ధరామయ్యను కోరారు. ఆయన ఆ ఆఫర్‌న తిరస్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని తేల్చి చెప్పేశారు. ఇది ఒక విధంగా డీకే శివకుమార్‌కు పెను ప్రమాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
డీకే శివకుమార్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు?
కొత్త మంత్రివర్గంలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి?
కొత్త మంత్రివర్గంలో దాదాపు 50 శాతం కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. 50 ఏళ్ల లోపు వయసున్న ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు మంత్రి పదవి వస్తుందా?
అవును, సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్యకు కీలకమైన మంత్రిపదవి దక్కే అవకాశం ఉంది. దీనితో పాటు సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు.
కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టడం కాంగ్రెస్‌కు సవాలేనా?
గత నాలుగు దశాబ్దాలుగా కర్ణాటకలో ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను చెరిపేసి, 2028 ఎన్నికల్లో మళ్లీ గెలవడం డీకే శివకుమార్‌కు అతిపెద్ద సవాలు.
ట్రెండింగ్ వార్తలు






















