అన్వేషించండి

DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?

DK Shivakumar Karnataka CM :సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకేఎస్ వాటిని ఎలా పరిష్కరిస్తారనే ఆసక్తి కర్ణాటక ప్రజల్లో ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సిద్దరామయ్య రాజీనామా చేశారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
  • జూన్ 3న బెంగళూరులో డీకేతో పాటు 8-10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
  • ఆర్థిక, సామాజిక సమతుల్యత, ఐదు గ్యారంటీ పథకాల అమలు డీకే ముందున్న సవాళ్లు.
  • మేకెదాటు డ్యామ్, బెంగళూరు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరణ కీలకం.

DK Shivakumar Karnataka CM Challenges: కర్ణాటకలో పాలనలో నాయకత్వ మార్పునకు కాంగ్రెస్‌ చేపట్టిన ప్రక్రియ ప్రస్తుతానికి సజావుగానే సాగుతోంది. ఫైర్‌ బ్రాండ్ పొలిటికల్ లీడర్‌గా పేరు ఉన్న సిద్దరామయ్య తన పదవికి సైలెంట్‌గా రాజీనామా చేసి కుర్చీని డీకే శివకుమార్‌కు అప్పగించేందుకు ఓకే చెప్పారు. జూన్ 3వ తేదీన కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు డీకేను చాలా సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకే వాటిని ఎలా పరిష్కరించుకొని వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. 

ఘనంగా ప్రమాణ స్వీకారం

దొడ్డాలహళ్లి కెంపేగౌడ శివకుమార్‌(DKS) తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటున్నారు. సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా ఎదిగిన ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్న శివకుమార్ పాలన ఎలా ఉంటుందనే ఆసక్తి అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం జూన్ 3న బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తారు. ప్రియాంక కూడా వస్తున్నారని సమాచారం. వీరితోపాటు వివిధ రాష్ట్రాల సీనియర్ లీడర్లు కూడా హాజరుకానున్నారు. 

డీకే తోపాటు పది మంది ప్రమాణం

డీకే శివకుమార్‌తోపాటు 8 నుంచి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మిగిలిన వారిని జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటి నుంచే రొటేషన్ సీఎం ఫార్ములాపై చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య దాదాపు మూడేళ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు అధికారి మార్పిడి సజావుగా జరగడానికి సిద్ధరామయ్య మే 28న రాజీనామా చేశారు. సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు లేదా రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు సమాచారం. తన రాజీనామా తర్వాత డీకే శివకుమార్ స్పందిస్తూ,,, వేగంగా నడవాలంటే ఒంటరిగా వెళ్లాలి, కానీ సుదూరం వెళ్లాలంటే కలిసి నడవాలి. అనే సామెతను గుర్తు చేస్తూ సిద్ధరామయ్యకు ధన్యవాదాలు తెలిపారు. 

ఎవరు ఈ డీకే శివకుమార్?

1962మే 15న కనపురలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డీకే శివకుమార్ విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1989లో 27 ఏళ్ల వయసులోనే సాతనూరు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. అప్పటి నుంచి 8 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌ నివేదిక ప్రకారం 1, 413 కోట్ల ఆస్తులతో డీకే శివకుమార్‌ దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. ఇందులో 1,140 కోట్ల రూపాయల చరాస్తులు, 273 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. గజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కాపాడటంలో కానీ, మహారాష్ట్రలో విలాస్రావు దేశ్‌ముక్ ప్రభుత్వాన్ని నిలబెట్టంలో కానీ, డీకే శివకుమార్ పోషించిన పాత్ర ఆయనను కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా మార్చింది. 

డీకే ముందు ఉన్న సవాళ్లు ఏంటీ?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్‌ ఐదు ప్రధాన సవాళ్లు ఎదుర్కోవాలి. సిద్ధరామయ్య వర్గం, తన సొంత వర్గం , వివిధ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తూ మంత్రులను ఎంపిక చేయడం మొదటి సవాలు. సిద్ధరామయ్య నిర్మించిన మైనారిటీ, వెనుకబడిన తరగతులు, దళిత ఓటు బ్యాంకును కాపాడుకోవడం డీకేకు అత్యంత ముఖ్యం. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారంటీ పథకాలకు ఏడాదికి దాదాపు 51వేల కోట్లు ఖర్చు అవుతుంది.ఈ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా చూడటం కత్తి మీద సామే. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

2

ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

3

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

4

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

5

భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

కావేరి నదిపై మేకెదాటు డ్యామ్ నిర్మాణం కోసం డీకే శివకుమార్ తీవ్రంగా శ్రమించారు. దీని కోసం కొత్త డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని డీల్ చేయడం చాలా అవసరం. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న డీకే, నగరం కోసం టన్నెల్ రోడ్డు, బిదాది ఏఐ సిటీ వంటి భారీ ప్రాజెక్టులను ప్లానే చేశారు. వీటికి నిధులు సమకూర్చడం ఆయనకు పెద్ద టాస్క్.వీటి అన్నింటి కంటే ముఖ్యం వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేకత రాకుండా చూడటం ఇప్పటి వరకు ఉన్న వ్యతిరేకతను దాటి పనులు చేయడం ఆయనకు అతి పెద్ద సవాల్. ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి వీటిని ఎలా పరిష్కరించి వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి కాంగ్రెస్‌ను తీసుకువస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

కర్ణాటకలో ఇప్పుడు డీకే మార్క్ పాలన మొదలవుబోతోంది. ట్రబుల్ షూటర్‌గా పార్టీని గట్టెక్కించిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏ తీరానికి చేరుస్తారో చూడాలి. 

Frequently Asked Questions

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు?

డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పు జరిగింది.

డీకే శివకుమార్ తో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు?

డీకే శివకుమార్ తో పాటు 8 నుండి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మిగిలిన వారికి రాజ్యసభ ఎన్నికల తర్వాత అవకాశం దొరుకుతుంది.

డీకే శివకుమార్ ముందు ఉన్న ప్రధాన సవాళ్లు ఏమిటి?

డీకే శివకుమార్ ఐదు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవాలి. వాటిలో మంత్రుల ఎంపిక, సిద్ధరామయ్య వర్గం, సొంత వర్గం, వివిధ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటించడం, కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు నిధులు సమకూర్చడం ముఖ్యమైనవి.

కావేరి నదిపై మేకెదాటు డ్యామ్ నిర్మాణంపై డీకే శివకుమార్ వైఖరి ఏమిటి?

డీకే శివకుమార్ మేకెదాటు డ్యామ్ నిర్మాణం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు మరియు కొత్త డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రి దీనిని వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget