అన్వేషించండి

DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!

DK Shivakumar Swearing In: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణం చేయనున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
  • సిద్ధరామయ్య రాజీనామాతో రాష్ట్రంలో అధికార మార్పు ప్రక్రియ ఊపందుకుంది.
  • జూన్ 3న బెంగళూరులో వైభవంగా ప్రమాణ స్వీకార వేడుక జరగనుంది.
  • రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే వ్యూహంతో ఈ నిర్ణయం.

DK Shivakumar Swearing In:  కర్ణాటక రాజకీయాల్లో మూడు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు శుభం కార్డు పడింది. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సర్వం సిద్ధమైంది. గురువారం సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామాతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు మొదలైంది. జూన్ 3న డీకే ప్రమాణం చేయనున్నారు. 

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన కర్ణాటకలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి స్థాయిలో ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన రాజీనామాను ఆమోదించిన అనంతరం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్‌గా పేరు ఉన్న డీకే శివకుమార్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తిని మార్చడం మాత్రమే కాదు, రాబోయే ఎన్నికలు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. 

జూన్ 3న బెంగళూరులో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార వేడుక అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీని కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం రెండు వేదికలను సిద్ధం పరిశీలిస్తున్నారు. మొదటిది విధాన సౌధ గ్రాండ్ స్టెప్స్‌. కర్ణాటక శక్తికి చిహ్నమైన ఈ కట్టడం ముందు ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రజల్లోకి బలమైన సంకేతం పంపాలని భావిస్తున్నారు. రెండోది లోక్‌ భవన్ గ్లాస్ హౌస్‌. ఒక వేళ వాతావరణం లేదా ఇతర భద్రతా కారణాల దృష్ట్యా మార్పు చేయాల్సి వస్తే ఈ వేదికను ప్రత్యామ్నాయంగా ఉంచారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. ముఖ్యనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక అతిథులుగా రానున్నారు. 

జూన్ 3న అధికారిక కార్యక్రమంలో గవర్నర్‌ థావర్ చంద్ గెహ్లాట్‌, డీకే శివకుమార్‌తో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం కేవలం ప్రమాణ స్వీకారం మాత్రమే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని నింపేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు ప్రమాణ స్వీకారానికి తరలి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే బెంగళూరు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సిద్ధ రామయ్య వంటి ఎక్స్‌పీరియన్స్‌ నేతను పక్కన పెట్టి, డీకేఎస్‌ లాంటి వ్యక్తికి పగ్గాలు అప్పగించడం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం భారీ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని మరింత సమర్థవంతంగా నడిపించగల సత్తా డీకేకు ఉందని నమ్ముతోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో డీకే శివకుమార్‌ పోషించిన పాత్ర కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. రాష్ట్ర పరిపాలనలో కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

2

ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

3

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

4

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

5

భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

 కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ కీలకమైన నేతలు. ఒకరు సామాజిక సమీకరణాల్లో దిట్ట అయితే, మరొకరు పార్టీ యంత్రాంగాన్ని నడపడంలో మాస్టర్ మైండ్. వీరిద్దరి మధ్య ఉన్న సమన్వయాన్ని కాపాడుతూనే అధికార మార్పిడిని ప్రశాంతంగా ముగించడం కాంగ్రెస్ ముందున్న అతి పెద్ద లక్ష్యం. ఇప్పటి వరకు దిశగా విజయం సాధించింది. మరోవైపు డీకే శివకుమార్ 25వే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఆయన దశాబ్దాల రాజకీయ పోరాటానికి దక్కిన గౌరవంగా ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. 

Frequently Asked Questions

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జూన్ 3న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార వేడుక జూన్ 3న బెంగళూరులో జరగనుంది. విధాన సౌధ గ్రాండ్ స్టెప్స్ లేదా లోక్ భవన్ గ్లాస్ హౌస్ వద్ద వేడుక నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరు హాజరుకానున్నారు?

ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక అతిథులుగా రానున్నారు.

సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎందుకు ఎంచుకున్నారు?

రాబోయే ఎన్నికల్లో పార్టీని సమర్థవంతంగా నడిపించగల సత్తా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన పాత్రను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Reasons For Prashant Kishor Win: బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Embed widget