అన్వేషించండి

Siddaramaiah resigns Karnataka CM 2026: కర్ణాటకలో ముగిసిన సిద్ధరామయ్య శకం - సీఎం పదవికి రాజీనామా సమర్పణ.. డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్!

DK Shivakumar next CM Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేశారు. హైకమాండ్ ఆదేశాల మేరకు గవర్నర్ కార్యదర్శికి లేఖ అందజేశారు. డీకే శివకుమార్ రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Lok Bhavan Siddaramaiah resignation letter: కర్ణాటక రాజకీయాల్లో  కీలక ఘట్టం చోటుచేసుకుంది. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో అగ్రనేతగా వెలుగొందుతున్న సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  గురువారం మధ్యాహ్నం  గవర్నర్ అధికారిక నివాసం  లోక్ భవన్ కు చేరుకున్న ఆయన, తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం నగరంలో అందుబాటులో లేనందున, సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి  కు అందజేశారు. ఈ సందర్భంగా తన క్యాబినెట్ సహచరులు,మద్దతుదారులతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు వచ్చారు.   

 హైకమాండ్ ఆదేశమే శిరోధార్యం 

రాజీనామా అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.  కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తాను  అని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ల పాటు తన ప్రభుత్వానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరామయ్య తన ప్రసంగంలో  పవర్ షేరింగ్ ఒప్పందాన్ని గౌరవిస్తున్నట్లు పరోక్షంగా సూచించారు. హైకమాండ్ ఏ బాధ్యత అప్పగించినా  నిర్వర్తిస్తానన్నారు.  

 డీకే శివకుమార్ పట్టాభిషేకం ఖాయం

సిద్ధరామయ్య రాజీనామాతో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అంతకుముందు ఉదయం జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ లో సిద్ధరామయ్య స్వయంగా తన సహచరులకు ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం సభలో చర్చనీయాంశమైంది. మే 29   సాయంత్రం జరగబోయే కాంగ్రెస్ శాసనసభా పక్షం  సమావేశంలో శివకుమార్‌ను అధికారికంగా కొత్త నేతగా ఎన్నుకోనున్నారు.

 రాజకీయ వ్యూహం - రాజ్యసభ ఆఫర్ 

సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు ఏఐసీసీలో కీలక పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే సిద్ధరామయ్య ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య, తనదైన సోషల్ ఇంజనీరింగ్  ద్వారా కర్ణాటకలో చెరగని ముద్ర వేశారు.
 
సిద్ధరామయ్య నిష్క్రమణతో కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక అధ్యాయం ముగిసింది. డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పాలనలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి. రెండు రోజుల్లో శివకుమార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget