అన్వేషించండి

Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?

Karnataka CM Resignation: సిద్ధరామయ్య తన రాజీనామాను ప్రకటించడంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖరారైంది. డీకే శివకుమార్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
  • ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • ఇరువర్గాల మధ్య అధికార పంపిణీ ఒప్పందం ప్రకారం మార్పు జరిగింది.
  • గవర్నర్ వచ్చాక సిద్ధరామయ్య రాజీనామా, శివకుమార్ ప్రమాణ స్వీకారం.

Karnataka CM Resignation: కర్ణాటక రాజకీయాల్లో గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సహచర మంత్రులు, సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. సిద్ధరామయ్య వారసుడిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది దక్షిణాది రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అతి పెద్ద వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది?

గురువారం ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో ఒక ప్రత్యేక వాతావరణం నెలకొంది. మెనూలో మసాలా దోశ, ఇడ్లీ, సాంబార్‌, కేసరిబాత్ వంటి కర్ణాట రుచులు ఉన్నప్పటికీ అక్కడ చర్చంతా వేరే సాగింది. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన చిత్రాల ప్రకారం  సమావేశం అత్యంత భావోద్వేగంగా సాగింది. డీకే శివకుమార్ సిద్ధరామయ్యను ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తదుపరి సీఎంగా డీకే శివకుమార్‌ను ప్రతిపాదించింది. నేను దానికి అంగీకరించాను. అని సిద్ధరామయ్య ఈ సమావేశంలో ప్రకటించారు. 

ఈ ప్రకటన వెలువడగానే డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన నివాసం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. 

సిద్ధరామయ్య మార్పునకు కారణం ఏంటీ?

ఈ నాయకత్వ మార్పు వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల  సమయంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒక పవర్ షేరింగ్ అగ్రిమెంట్ కుదిరినట్టు వార్తలు వచ్చాయి. ఆ ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని ఆ తర్వాత పదవిని డీకేఎస్‌ు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. నవంబర్‌ 2025 నాటిక ఈ గడువు ముగిసినప్పటికీ సిద్ధరామయ్య కొంతకాలం కొనసాగారు. 

కాంగ్రెస్ నిర్ణయం వెనుకు మాస్టర్ మైండ్ ఎవరు?

గత 48 గంటలుగా ఢిల్లీలో జరిగిన వరుస సమావేశాల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సిద్ధరామయ్యను ఒప్పించారు. ముఖ్యంగా ఈ మార్పు కోసం ప్రియాంక గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని కేడర్ స్థాయిలో బలోపేతం చేయగల డీకే శివకుమార్‌కు పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. 

సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయం వెలువడినప్పటికీ ప్రమాణ స్వీకారానికి చిక్కు వచ్చింది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం బెంగళూరులో లేరు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా బయట ఉన్నారు. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాతే సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పిస్తారు. డీకే శివకుమార్ శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

పార్టీలో చీలిక రాకుండా ఎత్తుగడ

ఇది ఒక రోజులో జరిగిన ప్రక్రియ కాదు. కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత జాగ్రత్తగా, పార్టీలో చీలికలకు లేకుండా ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సిద్ధరామయ్య వంటి లీడర్‌ను పదవి నుంచి తొలగించం పార్టీకి నష్టం కలిగించవచ్చు. అందుకే ఆయనకు రాజ్యసభ సీటుతోపాటు కేంద్ర పార్టీలో కీలక బాధ్యతలు ఆఫర్ చేశారు. అయితే సిద్ధరామయ్య ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని, వరుణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొసాగాలని అనుకుంటున్నట్టు సమాచారం. పార్టీలో విభేదాలు లేవని చెప్పడానికి టుగెదర్ ఉయ్ ఆర్‌ యునైటెడ్ అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో ఫొటోలను షేర్ చేశారు. 

సిద్ధరామయ్య vs డీకే శివకుమార్ 

సిద్ధరామయ్య అహింద( వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, దళితులు) ఓటు బ్యాంకుపై బలమైన పట్టు ఉన్న నాయకుడు. సామాజిక న్యాయం , సంక్షేమ పథకాలు ఆయన బలం. డీకే శివకుమార్ పార్టీ అర్గనైజర్,ట్రబుల్ షూటర్, వొక్కలిగ సామాజిక వర్గంలో పట్టు ఉన్న నాయకుడు. ఎన్నికల నిర్వహణలో నిధుల సేకరణలో ఆయనకు తిరుగులేదు.  

Frequently Asked Questions

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు?

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు.

సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణం ఏమిటి?

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉండి, తర్వాత పదవిని డీకే శివకుమార్‌కు అప్పగించాలి.

కాంగ్రెస్ పార్టీలో ఈ నిర్ణయం వెనుక ఎవరు కీలక పాత్ర పోషించారు?

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు సిద్ధరామయ్యను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రియాంక ఈ మార్పు కోసం గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

గవర్నర్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాణ స్వీకారానికి ఏమైనా ఆటంకం ఉందా?

అవును, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం బెంగళూరులో లేరు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించనున్నారు. డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget