అన్వేషించండి

Karnataka CM Resignation: కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?

DK Shivakumar Next CM: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉంది. డి.కె. శివకుమార్ తదుపరి సీఎం కానున్నట్లు చెబుతున్నారు. ఏమైనా సమీకరణాలు కుదరకపోతే.. ఖర్గే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Karnataka Politics Today: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని గంటలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  మే 28 గురువారం తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా జోరుగా సాగుతోంది.  

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన తరుణంలో, నాయకత్వ మార్పు అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.  తాజా సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  గురువారం ఉదయం 11 గంటలకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి.

 హైకమాండ్ ఢిల్లీ  వ్యూహం 

గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిగిన వరుస భేటీల తర్వాతే ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి పంపాలని, త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను అభ్యర్థిగా నిలబెట్టాలని హైకమాండ్ ప్రతిపాదించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఓబీ ముఖచిత్రంగా సిద్ధరామయ్యను ప్రొజెక్ట్ చేయాలనేది రాహుల్ గాంధీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఎప్పటి నుంచో సీఎం పీఠం కోసం వేచి చూస్తుండటంతో, ఇప్పుడు ఆయనకు మార్గం సుగమమైంది. అయితే సిద్ధరామయ్య శివకుమార్ సీఎంగా వద్దని అంటున్నట్లుగా చెబుతున్నారు. సమీకరణాలు కుదరకపోతే ఖర్గే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

గురువారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ 

రాజీనామాకు ముందు సిద్ధరామయ్య తన నివాసంలో మంత్రివర్గ సహచరులందరికీ అల్పాహార విందు  ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే ఆయన తన నిర్ణయాన్ని మంత్రులకు అధికారికంగా తెలిపి, వారందరికీ కృతజ్ఞతలు చెప్పనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించనున్నారు. ఈ పరిణామాలతో  కర్ణాటక ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా కూడా  బెంగళూరుకు చేరుకోనున్నారు.   

 డీకేఎస్ సిద్ధం.. యతీంద్రకు ఛాన్స్? 

రాష్ట్రంలో పట్టున్న  ట్రబుల్ షూటర్ డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, సిద్ధరామయ్య తన రాజీనామాకు బదులుగా తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త క్యాబినెట్‌లో కీలక మంత్రి పదవి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ సీఎం అయితే, అహిందా వర్గాల మద్దతు తగ్గకుండా ఉండటానికి సిద్ధరామయ్య వర్గానికి సముచిత స్థానం కల్పించడం హైకమాండ్‌కు అనివార్యంగా మారింది.

 విపక్షాల విమర్శలు 

ఈ పరిణామాలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. కర్ణాటకలో పాలన కుంటుపడిందని, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల వల్లే రాష్ట్రం నష్టపోతోందని బీజేపీ  విమర్శిస్తోంది. సీఎం ఎవరైనా సరే, ఈ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదని, ముందస్తు ఎన్నికలు తప్పవని  అంటున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP MPTC ZPTC Election Results: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
Bigg Boss Season 10 Today November 7th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ వీక్ త్యాగం చేసిన నరేశ్! దేబ్జానీని తన్నిన ముకేశ్! నాగ్ తీర్పు సూపర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ వీక్ త్యాగం చేసిన నరేశ్! దేబ్జానీని తన్నిన ముకేశ్! నాగ్ తీర్పు సూపర్!
MPTC ZPTC Election Results: పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!
పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!
Sai Durgha Tej Kiran : కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
Embed widget