అన్వేషించండి

Mallareddy : డీకే శివకుమార్‌ను అందుకే కలిశా - మల్లారెడ్డి క్లారిటీ !

Telangana News : ప్రైవేటు కార్యక్రమంలో డీకే శివకుమార్ ను కలిశానని రాజకీయాల కోసం కాదని మల్లారెడ్డి చెబుతున్నారు. డీకే శివకుమార్ తో భేటీ ఫోటో వైరల్ కావడంతో పార్టీ మారుతున్నారన్న చర్చ జరుగుతోంది.

Mallareddy says that he met DK Sivakumar at a private function :    మాజీ మంత్రి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. ‘‘బెంగళూరులో జరిగిన ఓ ప్రయివేటు కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను కలిశా. అందులో ఎలాంటి రాజకీయం లేదు. నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతా. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని స్పష్టం చేశారు. అధిష్ఠానం అవకాశమిస్తే మల్కాజిరిగి లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ఇటీవల మల్లారెడ్డి చెప్పారు. కానీ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో తన కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు.  

అయితే మల్లారెడ్డి  కాంగ్రెస్‌లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. అయితే ఆయనను  పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది.దీంతో ాయన డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మల్లారెడ్డి , ఆయన కుమారుడు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలిశారు. ఈ ఫోటో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

 కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్‌ ప్రమాదంలో పడింది. ఆయనకు మెడికల్‌ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలతోపాటు ఇతర వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట తమ కాలేజీ కోసం ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మించిన రోడ్డును అధికారులు తొలగించారు. తర్వాత మల్లారెడ్డి అల్లురు మర్రి రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కట్టిన ఇంజినరింగ్ కాలేజీ  భవనాలను కూలగొట్టారు.                                                           

మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం, గతంలో రేవంత్‌ రెడ్డిపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే మల్లారెడ్డి కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కీలక నేతతో రాయబారం నడిపానని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అంగీకరించారని ఆయన చెబుతూ వస్తున్నారు.  గతంలో ఎంపీగా, మంత్రిగా మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకొని భూములను కారు చౌకగా తన పేరిట, అనుచరుల పేరిట కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై వరుసగా నోటీసులు వస్తూండటంతో ఆందోళన చెందుతున్నట్లుగా చెబుతున్నారు.                         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
KTR: కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
Karimnagar Robbery: కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
Embed widget