Karnataka: మేడిన్ కర్ణాటక ఉత్పత్తులపై కన్నడ భాషే ఉండాలి - సీఎం సిద్దరామయ్య ఆదేశం !
Kannada labels: కర్ణాటకలో కన్నడ భాషా వివాదం ముదురుతోంది. తాజాగా సీఎం సిద్దరామయ్య కూడా కన్నడ భాష ఇంప్లిమెంటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Kannada labels must for Karnataka-made products Cm Sidda: కర్ణాటకలో ఉండేవాళ్లందరికీ కన్నడ నేర్పించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పిలుపునిచ్చారు. కన్నడ రాజ్యోత్సవ అవార్డులను ప్రధానం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఆ ప్రసంగంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో తయారయ్యే ఉత్పత్తులన్నింటిపై కన్నడ భాషనే ముద్రించాలని స్పష్టం చేశారు. ఇంగ్లిష్‌లో వివరాలు ఉన్నా ఖచ్చితంగా కన్నడ కూడా ముద్రించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం మేడిన్ కర్ణాటక ఉత్పత్తుల మీద ఇంగ్లిష్‌లో మాత్రమే వివరాలు ఉంటున్నాయన్నారు.
కన్నడిగులు అంతా కన్నడలోనే మా ట్లాడుకోవాలని పిలుపునిచ్చారు సిద్దరామయ్య. కన్నడకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని దాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు. జీవనోపాధి కోసం ఎంతో మంది కర్ణాటకకు వస్తున్నారని ఇక్కడ గాలి పీల్చి.. ఇక్కడ నీరు తాగుతున్న ప్రతి ఒక్కరూ కన్నడిగనేనని స్పష్టం చేశారు. ఇతర భాషాలను తాను వ్యతిరేకించడం లేదని .. అంత మాత్రాన కన్నడను త్యాగం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఉంటున్న అందరికీ కన్నడ నేర్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
కర్ణాటకలో కన్నడ భాష అంశంపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దుకాణాలపై ఖచ్చితంగా కన్నడ భాషలో బోర్డులు ఉండాలి. అందుకే ఎంత పెద్ద మల్టినేషనల్ కంపెనీ అయినా కన్నడలో బోర్డులు పెడతాయి. అయితే ఇటీవలి కాలంలో కర్ణాటకలో ఉంటున్న వాళ్లు కూడా కన్నడ నేర్చుకోవాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. గ్లోబల్ సిటీగా మారిన బెంగళూరులో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్థిరపడ్డారు. వారిలో చాలా మందికి కన్నడ రాదు. కొంత మంది బయటకు వెళ్లి హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఎందుకు నేర్చుకోరని వాదనలకు దిగుతున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
ఇలాంటి సమయంలో కన్నడ భాష ఇంప్లిమెంటేషన్ పై సిఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో ఉండాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందేనన్నట్లుగా వారి తీరు ఉంటోంది. మరే రాష్ట్రంలోనూ ఇలా తమ రాష్ట్రంలోని భాషను నేర్చుకోవాలని డిమాండ్ చేయడం లేదు. అలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని .. ఆసక్తి ఉంటే నేర్చుకుంటారు కానీ.. ఉపాధి కోసం వచ్చిన వారిని.. అక్కడ పన్నులు కడుతూ అక్కడే బతుకుతున్న వారిని భాష పేరుతో వేరు చేయడం కరెక్ట్ కాదన్న వాదన వినిిస్తోంది. అయినా అక్కడి రాజకీయ పార్టీల ప్రోద్భలంతో ఇలాంటివి సాగిపోతున్నాయి.