అన్వేషించండి

Karnataka Politics Updates:కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్‌గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?

Karnataka Politics Updates:కర్ణాటక రాజకీయాల్లో సంక్షోభమే ఊపిరిగా ఎదిగిన సిద్ధరామయ్య రాజీనామా ఒక శకం ముగింపు సూచిస్తోంది.  అయితే సిద్ధరామయ్య అంత ఈజీగా తప్పుకుంటారా అనే అనుమానం చాలా మందిలో ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, ఇది ఒక శకానికి ముగింపు.
  • అవినీతి ఆరోపణలు, అంతర్గత పోరాటాలు ఆయనపై వ్యతిరేకత పెంచాయి.
  • డీకే శివకుమార్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
  • సిద్ధరామయ్య ప్రశాంతంగా వెళ్లే రకం కాదు, భవిష్యత్తులో సవాల్ విసరవచ్చు.

Karnataka Politics Updates:కర్ణాటక రాజకీయ యవనికపై సిద్దారామయ్య అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, పోరాటాలతో ఎదిగిన నిప్పు కణిక. అలాంటి వ్యక్తి తన పదవిని వేరే వ్యక్తికి అప్పగించి సైలెంట్‌గా వెళ్లిపోతారని ఎవరూ అనుకోరు. 1970వ దశకంలో మొదలైన సోషలిస్టు ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన ఈ నాయకుడు, అధికారాన్ని వదులుకోవడంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండలేదు. తాజాగా ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వేళ, ఇది ఒక శకానికి ముగింపా లేక మరో రాజకీయ యుద్ధానికి నాందీ అనేది ఆసక్తికరంగా మారింది. 

సిద్ధరామయ్య బ్యాక్‌గ్రౌండ్‌ 

సిద్ధరామయ్య ప్రాథమికంగా ఒక అరాచకవాదిగా పేరు ఉన్న సోషలిస్టు నాయకుడు. 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, రామకృష్ణ హెగ్డే నాయకత్వంలో మంత్రిగా పని చేశారు. జనతా పరివార్ నుంచి కాంగ్రెస్‌లోకి ఇంపోర్ట్ అయిన నాయకుడైనప్పటికీ పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. నితీష్ కుమార్, లాలు ప్రసాద్‌ యాదవ్‌ వంటి అదే తరం సోషలిస్ట్‌ నాయకుల వరుసలో నిలిచే చివరి గొంతుక సిద్ధరామయ్య. 

దశాబ్దాల రాజకీయ ప్రస్థానం తర్వాత సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా కాదు, కర్ణాటకలో పాతుకు పోయిన సామాజిక సమీకరణాల మారవు. అవినీతి ఆరోపణలు, అంతర్గత అధికార పోరాటాలు, పరిపాలనలో మందకొడితనం వంటి కారణాలు ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. 

2013నుంచి 2018 వరకుఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ని చేసిన సిద్ధరామయ్య, 2023లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు పాత వైభవాన్ని కొనసాగించలేకపోయారు. 2023ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవ కోసం జరిగిన పోరాటంలో డీకే శివకుమార్‌ను వెనక్కి నెట్టి పదవిని దక్కించుకున్నప్పటికీ, అది ముళ్ల బాటగానే మిగిలిపోయింది. గత మూడేళ్లుగా ఆయన పట్టు సడలుతూ వచ్చింది. ఆయన పరిపాలనలో నైపుణ్యం తగ్గుతూ రావడం సొంత వర్గం వల్ల ఒంటరి కావడం వంటి ఆయనను బలహీనపరిచాయి. 

ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది

డీకే శివకుమార్‌ కేవలం ఒక నాయకుడిగా కాకుండా సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. పార్టీ పాత తరం నాయకులు కూడా శివకుమార్‌కు మద్ధతు తెలపడం సిద్ధరామయ్యకు ప్రతికూలంగా మారింది.  సిద్ధరామయ్యతో ఇక ముందుకు సాగడం రాజకీయంగా నష్టమని భావించిన కాంగ్రెస్ అధిష్టానం. బలవంతంగా ఆయనను రాజీనామా వైపు నడిపించింది. 

రాజకీయాల్లో పైటర్‌గా ఉన్న ఎదిగిన సిద్ధరామయ్య 

2013లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీని చీల్చడానికైనా వెనుకాడరనే పరిస్థితి ఉండేది. మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్లను పక్కనపెట్టి ఆయన సీఎం అయ్యారు. 2018లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, జేడీఎస్‌తో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పొత్తు చెదిరిపోవడంలో  ఆయన పాత్ర ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఓడిపోయిన ముఖ్యమంత్రి మళ్లీ 2023లో బలంగా తిరిగి రావడం కర్ణాటక చరిత్రలో అరుదు. ఎమ్మెల్యేల మద్దతు, రాహుల్ గాంధీ అండతో ఆయన మళ్లీ పగ్గాలు చేపట్టారు. 

కాంగ్రెస్ ముందు ఉన్న సవాళ్లు

సిద్ధరామయ్యను తప్పించడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆయనను తప్పించడం అంటే దశాబ్దాలుగా ఉన్న సామాజిక సమీకరణాలను మార్చడమే. అయితే ఆయన రాజ్యసభకు వెళ్లడానికి లేదా జాతీయ రాజకీయాల్లోకి రావడానికి సముఖంగా లేరు. బెంగళూరులోనే ఉంటూ కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఆయన ప్రశాంతంగా వెళ్లే రకం కాదని చరిత్ర చూస్తే అర్థమవుతుంది. భవిష్యత్‌లో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకొస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది.  

Frequently Asked Questions

సిద్ధరామయ్య ఎవరు?

సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో ఒక ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు. ఆయన దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి, కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.

సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

అవినీతి ఆరోపణలు, అంతర్గత అధికార పోరాటాలు, పరిపాలనలో మందకొడితనం వంటి కారణాలు ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. పార్టీ హైకమాండ్ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకుంది.

డీకే శివకుమార్ పాత్ర ఏమిటి?

డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. పార్టీలోని పాత తరం నాయకుల మద్దతు కూడా ఆయనకు లభించింది, ఇది సిద్ధరామయ్యకు ప్రతికూలంగా మారింది.

సిద్ధరామయ్య రాజీనామా తర్వాత ఏమి చేయవచ్చు?

ఆయన రాజ్యసభకు లేదా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా లేరు. బెంగళూరులోనే ఉంటూ కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget