అన్వేషించండి

YS Sharmila Rajya Sabha: ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!

Rajya Sabha Elections | రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి అవకాశం కల్పించి అక్కడి కేడర్‌లో కొత్త జోష్ నింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ రేసులో వైఎస్ షర్మిల పేరు వినిపిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై పార్టీ దృష్టి పెట్టింది.
  • వైఎస్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయి.
  • కర్ణాటక నుంచి ఒక రాజ్యసభ స్థానం ఏపీకి కేటాయించనుంది.
  • వైఎస్ వారసత్వాన్ని తిరిగి తీసుకురావడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు.

YS Sharmila Politics | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ను బలోపేతం చేసే అంశంపై అధిష్టానం దృష్టిపెట్టనుంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో పార్టీ అధికారంలో ఉండటంతో దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీపై ఆ పార్టీ దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని చురుకుగా పనిచేసేలా.. పార్టీ ప్రస్తుత కార్యకర్తల్లో ఓ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తోంది. 

ఈ క్రమంలోనే వైఎస్ షర్మిళకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానం దృష్టిలో పలువురు నేతలున్నా షర్మిలకే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు కేవీపీ రాంమచందర్రావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి లాంటి విధేయులు రేసులో ఉన్నప్పటికీ వారి వయోభారం రిత్యా.. వచ్చే ఎన్నికల నాటికి కూడా చురుకుగా పనిచేసే నాయకులకోసం పార్టీ చూస్తోంది. షర్మిల వైఎస్ కుమార్తె గా మాత్రమే కాకుండా..  ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలిగా,  పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేస్తుండటం, మీడీయాలో ఎంతో కొంత చోటు దక్కించుకునే పాపులారిటీ ఉండటం, అన్నిటికన్నా మహిళలకు ప్రాధాన్యత ఇస్తే షర్మిళకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Also Read: DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్

కర్ణాటక నుంచే అవకాశం.. 

ప్రస్తుతం కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.  నాలుగులో బీజేపీ కీ ఒక స్థానం పోగా మిగిలిన మూడు స్ధానాలు కాంగ్రెస్ కు దక్కుతాయి. మూడింట్లో ఒక స్ధానం పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేకు ఖాయం. మిగిలిన రెండు స్ధానాల్లో ఒకటి ఏపీకి ఇవ్వాళన్న నిర్ణయంలో కాంగ్రెస్ ఉంది.  జూన్ 8 నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అవుతుండటంతో అక్కడి పార్టీ అభ్యర్ధులపై కాంగ్రెస్ లో తీవ్ర కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే వైఎస్  షర్మిళ ఈరోజు రాహుల్ గాంధీని కూడా కలిశారు. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్యకూడా తాను రాజ్య సభకు వెళ్లే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడం షర్మిళకు మరింత అనుకూలంగా మారింది. 

షర్మిళకు గాంధీ కుటుంబం అనుకూలం. వైఎస్ జగన్ పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గా మారిపోయింది. ఆయన అభిమానులను తిరిగి కాంగ్రెస్ గూటికి తెచ్చుకునేందుకు షర్మళ ఓ అవకాశం గా కనిపిస్తోంది. అందులో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు ఆమెకు రాజ్యసభ ఇచ్చేందుకు అనుకూలంగా వున్నారని తెలుస్తోంది. కర్నాటకలోని ఇద్దరు కీలక నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో షర్మిళకు మంచి సంబందాలున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేవీపీ, రఘువీరాలతో పోల్చుకుంటే షర్మిళ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 

Also Read: Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు

కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి తమవైపుకు తిప్పుకోవడం, ప్రస్తుత పార్టీ నాయకులను కాపాడుకోవడం లాంటి పలు సవాళ్లు షర్మిళముందున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిళకు మించిన బలమైన నాయకత్వం ఏపీలో కనిపించడంలేదు.. జగన్ పార్టీని తట్టుకుని నిలబడాలన్నా, వైఎస్ వారసత్వం కాంగ్రెస్ తోనే ఉందన్న వాదన అన్నీ వైఎస్ షర్మిళకు కలిసొస్తున్నట్టు సమాచారం.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అధిష్టానం దృష్టి పెట్టిందా?

అవును, తెలంగాణ, తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో, బలహీనంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై అధిష్టానం దృష్టి సారించింది.

వైఎస్ షర్మిళకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయా?

అవును, వైఎస్ షర్మిళకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమెకు గాంధీ కుటుంబం నుండి కూడా మద్దతు లభిస్తోంది.

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు ఎక్కడ నుండి అవకాశం వస్తుంది?

కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజ్యసభ స్థానం కేటాయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

వైఎస్ షర్మిళకు రాజ్యసభ పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి?

షర్మిళ పీసీసీ అధ్యక్షురాలిగా, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా, వైఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ఆమె ఒక అవకాశంగా కనిపిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Embed widget