అన్వేషించండి

Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు

Supreme Court on Human Trafficking | ఏ కారణంతో అయినా సరే వయోజనులు ఎవరైనా సొంతంగా సెక్స్ వర్కర్‌గా మారడం నేరం కాదని, బలవంతంగా ఈ వృత్తిలోకి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్ల హక్కులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
  • స్వచ్ఛంద వయోజన సెక్స్ వర్కర్లను వేధించరాదని పోలీసులకు ఆదేశాలు.
  • సెక్స్ వర్కర్ల గుర్తింపును వెల్లడిస్తే మీడియాపై కఠిన చర్యలు.
  • చిరునామా రుజువు లేకుండానూ ఆధార్ కార్డులు జారీ చేయాలి.

Supreme Court Key Decision | న్యూఢిల్లీ: దేశంలో మానవ అక్రమ రవాణాను (Human Trafficking) అరికట్టడంతో పాటు సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తి (సెక్స్ వర్కర్లుగా మారుతున్న వారు)ని ఎంచుకున్న వయోజనులకు, బలవంతంగా ఈ రొంపిలోకి లాగిన బాధితులకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని, కేవలం లైంగిక వృత్తిలో ఉందనే ఏకైక కారణంతో ఏ తల్లి నుంచైనా ఆమె బిడ్డను బలవంతంగా వేరు చేయలేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

పోలీసులకు కఠిన ఆదేశాలు.. మీడియాకు హెచ్చరికలు
తన వ్యక్తిగత కారణాలతో సొంతంగా, ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపై అనవసరంగా దాడులు చేయడం, వారిని వేధించడం లేదా క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే, రెస్క్యూ ఆపరేషన్లు లేదా దాడులు నిర్వహించే సమయంలో సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలను ప్రసారం చేయడం లేదా వారి గుర్తింపును వెల్లడించడం తీవ్రమైన నేరమని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నవారిని వదిలిపెట్టి.. మహిళలు, మైనర్లను బలవంతంగా అక్రమ రవాణా చేసే మాఫియాపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసింది.

Also Read: రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI

ఆధార్ కార్డుల జారీకి స్పష్టమైన ఆదేశం
సెక్స్ వర్కర్లకు ఇతర వ్యక్తుల తరహాలోనే సమాన చట్టపరమైన రక్షణ కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నివాస ధృవీకరణ పత్రాలు (అడ్రస్ ప్రూఫ్) లేకపోయినప్పటికీ, సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులను జారీ చేయాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీని ద్వారా వారికి సామాజిక భద్రతతో పాటు ఇతర వ్యక్తుల తరహాలోనే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందే అవకాశం లభిస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

తీర్పులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
హైకోర్టులలో విచారణలు పూర్తయిన తర్వాత తీర్పుల ప్రకటనలో జరుగుతున్న ఆలస్యాన్ని (తీర్పు రిజర్వ్) నివారించడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పుల ప్రకటనలో ఆలస్యం కావడం వల్ల పిటిషనర్లకు చాలా నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాలలో సకాలంలో తీర్పులు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను సాధారణంగా 3 నెలల లోపే వెల్లడించాలని ఆదేశించింది. బెయిల్ విషయాలలో ఆర్డర్లను అదే రోజు ప్రకటించడానికి ప్రయత్నాలు జరగాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఒకవేళ తీర్పు ఉత్తర్వులను రిజర్వ్ చేసినట్లయితే, వాటిని మరుసటి రోజుకల్లా డెలివరీ చేసి, సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.

Frequently Asked Questions

లైంగిక వృత్తిని స్వచ్ఛందంగా ఎంచుకున్న వయోజనులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు?

స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వయోజనులపై అనవసరంగా దాడులు చేయడం, వేధించడం లేదా క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు ఎలాంటి చారిత్రాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది?

స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వయోజనులకు, బలవంతంగా ఈ వృత్తిలోకి లాగిన బాధితులకు మధ్య తేడాను గుర్తించాలని, ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించే హక్కును కాపాడాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

సెక్స్ వర్కర్ల గుర్తింపును వెల్లడించడంపై మీడియాకు సుప్రీంకోర్టు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది?

రెస్క్యూ ఆపరేషన్లు లేదా దాడుల సమయంలో సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలను ప్రసారం చేయడం లేదా వారి గుర్తింపును వెల్లడించడం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది.

సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డుల జారీకి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశం ఇచ్చింది?

నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినా, సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులను జారీ చేయాలని UIDAIని సుప్రీంకోర్టు ఆదేశించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget