అన్వేషించండి

రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI

FSAAI issue Notices to IRCTC | దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లోని టాయిలెట్‌తో క్యాటరింగ్ సిబ్బంది వంటపాత్రలు కడగటంపై ఐఆర్‌సీటీకి FSAAI నోటీసులు జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాయిలెట్లలో వంట పాత్రలు కడగడంపై IRCTCకి FSSAI నోటీసులు.
  • కలుషిత ఆహారం, ఫుడ్ పాయిజన్ ప్రమాదంపై FSSAI ఆందోళన.
  • ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనపై IRCTC సమాధానం కోరింది.
  • నిబంధనలు పాటించకపోతే IRCTCపై కఠిన చర్యలు.

న్యూఢిల్లీ: ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లోని టాయిలెట్ లోపల వంటపాత్రలు కడగటంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ( FSSAI) ప్రభుత్వ యాజమాన్యంలోని IRCTCకి నోటీసు జారీ చేసింది. లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌ (LTT) ముంబయి- ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నెంబర్ 12223)లో క్యాటరింగ్‌ సిబ్బంది చేసిన నిర్వాకాన్ని ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో ఆహార నియంత్రణ సంస్థ FSSAI ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ చేసింది. 

టాయిలెట్‌తో వంట పాత్రలు కడగటం ద్వారా ఆహారం కలుషితమై, ఫుడ్ పాయిజన్‌కు దారితీసే అవకాశం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ పేర్కొంది. ఆహార భద్రత కోణంలోనూ ఇది నిర్లక్ష్యంతో కూడిన చర్య అని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై వీలైనంత త్వరగా సమాధానం చెప్పాలని IRCTCని కోరింది. టాయిలెట్ పరిసరాల్లో వంట పాత్రలు కడగడం వల్ల ఆహారం కలుషితమయ్యే తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని, ఆహార భద్రత కోణంలోనూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. 

Also Read: Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ బిజినెసెస్) రెగ్యులేషన్స్, 2011 లోని షెడ్యూల్ 4 ప్రకారం, ఆహార వ్యాపార నిర్వాహకులు ఆహారం, ఆహార పాత్రలు కలుషితం కాకుండా నిరోధించడానికి పరిశుభ్రమైన ప్రాసెసింగ్, హ్యాండ్లింగ్, వాషింగ్, క్లీనింగ్ పద్ధతులను పాటించాలి. ఈ నెల ప్రారంభంలో, క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) లో నాణ్యత లేని గుడ్ల విక్రయాలపై వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించి FSSAI వారి నుండి వివరణ కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో కూడా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చిన వినియోగదారుల ఫిర్యాదులను FSSAI సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టింది. 

FSSAI అంటే ఏమిటి?: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది దేశంలో ఆహార భద్రత, నాణ్యతను పర్యవేక్షిస్తుంది.

IRCTC: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేది భారత్‌లో రైల్వేలకు సంబంధించి ఆన్‌లైన్ టికెటింగ్, క్యాటరింగ్ (ఆహార సరఫరా), పర్యాటక సేవలను నిర్వహించే ప్రభుత్వ విభాగం.

Also Read: CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!

నిబంధనల ఉల్లంఘన: రైళ్లలో ప్రయాణీకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యత IRCTCపై ఉంది. టాయిలెట్ నీటితో గిన్నెలు కడగడం అనేది బ్యాక్టీరియా, క్రిములు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. ఇది ప్రయాణికులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. గతంలో కూడా ఇటువంటి ఉల్లంఘనలపై రైల్వే శాఖ భారీ జరిమానాలు విధించడమే కాకుండా కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి.

Frequently Asked Questions

రైలు టాయిలెట్లలో వంట పాత్రలు కడగడంపై FSSAI ఎందుకు IRCTCకి నోటీసు జారీ చేసింది?

రైలు టాయిలెట్లలో వంట పాత్రలు కడగడం వల్ల ఆహారం కలుషితమై, ఫుడ్ పాయిజన్ వచ్చే అవకాశం ఉందని, ఇది ఆహార భద్రత కోణంలో నిర్లక్ష్యమని FSSAI తెలిపింది.

FSSAI అంటే ఏమిటి?

FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్తి సంస్థ, ఇది దేశంలో ఆహార భద్రత, నాణ్యతను పర్యవేక్షిస్తుంది.

IRCTC అంటే ఏమిటి?

IRCTC అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇది భారతదేశంలో రైల్వేలకు సంబంధించిన ఆన్‌లైన్ టికెటింగ్, క్యాటరింగ్, పర్యాటక సేవలను నిర్వహించే ప్రభుత్వ విభాగం.

వంట పాత్రలు టాయిలెట్లలో కడగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి?

టాయిలెట్లలో వంట పాత్రలు కడగడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు వేగంగా వ్యాప్తి చెంది, ప్రయాణికులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజన్ వచ్చే ప్రమాదం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget