అన్వేషించండి

8th Pay Commission Updates: 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 

8th Pay Commission Updates: 8వ వేతన సంఘం తన పనిని చాలా వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు యూనియన్లతో చర్చలు జరిగింది. ఇప్పుడు మెమోరాండం సమర్పించే గడువు 31 వరకు పెంచింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8వ వేతన సంఘం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది.
  • ఢిల్లీలో రక్షణ, రైల్వే యూనియన్లతో కమిషన్ చర్చించింది.
  • మెమోరాండం సమర్పణ గడువు మే 31, 2026 వరకు పొడిగించారు.
  • హైదరాబాద్, జమ్మూకశ్మీర్, లడఖ్‌లలో కమిషన్ పర్యటిస్తుంది.

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Central Government employees ), పెన్షనర్లు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న 8 వేతన సంఘం ప్రక్రియ సంప్రదింపుల దశకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాలు, స్టేక్ హోల్డర్లతో చర్చలు జరపడం ద్వారా వారి డిమాండ్లు, అంచనాలను కమిషన్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న 5 ప్రధాన పరిణామాలు, రాబోయే షెడ్యూల్ వివరాలు గురించి చూద్దాం. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర అలవెన్స్‌లు సమీక్షించి, సవరించడం కోసం ఈ తాత్కాలిక కమిషన్ ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని నియమించడం ప్రభుత్వం ఆనవాయితీగా వస్తోంది. ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించడం, వారి డిమాండ్లను వినడం, ప్రభుత్వ వ్యయ నిర్వహణను బ్యాలెన్స్ చేయడం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం. 

ప్రస్తుత 8 వ వేతన సంఘం నవంబర్ 3, 2025న అధికారికంగా ఏర్పాటు అయ్యింది. ఈ సంఘం తీసుకునే నిర్ణయాలు సుమారు1.1 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారి కుటుంబ సభ్యులపై నేరుగా ప్రభావం చూపుతాయి. 

ఢిల్లీలో కీలక సమావేశం

8వ వేతన సంఘం మే 13, 14 తేదీల్లో ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా రక్షణ, రైల్వే యూనిన్లతో కమిషన్ సభ్యులు చర్చలు జరిపారు. ఉద్యోగుల వేతన సవరణ, అలవెన్స్‌లు, పెన్షన్లకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను కమిషన్ ముందు యూనియన్లు ఉంచాయి. 

మెమోరాండం గడువు పొడిగింపు (memorandum deadline extension)

ఉద్యోగ సంఘాలకు ఊరట కల్పించే విధంగా కమిషన్ తన మెమోరాండం సమర్పణ గడువును పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం ఈ గడువును మే 31, 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల వివిధ సంఘాలు తమ డిమాండ్లను మరింత లోతుగా విశ్లేషించి, నివేదికలను సమర్పించడానికి అదనపు సమయం లభించినట్టైంది. 

హైదరాబాద్‌లో టూర్‌లు 

దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. మే 18-19 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటిస్తుంది. ఇక్కడ స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడబోతోంది. జూన్ 1-4 మధ్య జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తారు. జూన్ 8న లడఖ్‌ ప్రాంతంలో చర్చలు జరుపుతారు. 

ఈసారి ఫిట్‌మెంట్ ఎంత?

ఉద్యోగులందరి దృష్టి ప్రస్తుతం ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పైనే ఉంది. ఏడో వేతన సంఘం సమయంలో ప్రభుత్వం 2.57 ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను వర్తింపజేసింది. ఈసారి అది ఎంత ఉంటుంది అనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఉద్యోగ సంఘాలు దీనిని గణనీయంగా పెంచాలని కోరుతున్నాయి. 

8 వ వేతన సంఘం ప్రస్తుతం ఫీడ్‌బ్యాక్ సేకరించే దశలో ఉంది. జీతాలు, పెన్షన్లు, అలవెన్స్‌ల విషయంలో అధికారిక సమాచారం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌http://8cpc.gov.in/ను పరిశీలించాలన్నారు. 

AINPSEF కీలక డిమాండ్లతో మెమోరాండం సమర్పణ

ప్రస్తుతం అమల్లో ఉన్న AINPSEFపై ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని ఆల్‌ ఇండియా ఎన్పీస్ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పలు డిమాండ్లతో సమగ్రమైన మెమోరాండం కమిషన్‌కు సమర్పించింది. ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో తీసుకునే చివరి బేసిక్ జీతంలో కనీసం 50 శాతం మొత్తాన్ని దానికి తోడు కరవు భత్యాన్ని కలిపి నెలవారీ పెన్షన్‌గా అందించాలని డిమాండ్ చేసింది. ఒకవేళ పెన్షనర్‌ మరణిస్తే వారి కుటుంబానికి ఆ పెన్షన్ మొత్తంలో 60 శాతాన్ని ఫ్యామిలీ పెన్షన్‌గా ఇవ్వాలి. 

ఎన్పీఎస్‌ కింద చేరిన ఉద్యోగులు 2033 నుంచి పెద్ద సంఖ్యలో రిటైర్ కాబోతున్నారు. ద్రవ్యోల్బణం, మార్కెటింగ్ ఒడిదుడుకుల వల్ల వారి పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండే ప్రమాదం ఉందని AINPSEF ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తక్కువ వేతన స్థాయయిలో ఉండి, తక్కువ కాలం సర్వీస్‌ చేసిన వారికి పెన్షన్ కేవలం రూ. 300 నుంచి 3000 మధ్య మాత్రమే అందుతోందని పెడరేషన్ పేర్కొంది. 

Frequently Asked Questions

8వ వేతన సంఘం ఎప్పుడు అధికారికంగా ఏర్పాటు చేయబడింది?

8వ వేతన సంఘం నవంబర్ 3, 2025న అధికారికంగా ఏర్పాటు చేయబడింది. ఇది సుమారు 1.1 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం చూపుతుంది.

8వ వేతన సంఘం మెమోరాండం సమర్పణ గడువు ఎప్పటి వరకు పొడిగించారు?

ఉద్యోగ సంఘాలకు ఊరటనిస్తూ, మెమోరాండం సమర్పణ గడువును మే 31, 2026 వరకు పొడిగించారు. దీనివల్ల సంఘాలు తమ డిమాండ్లను లోతుగా విశ్లేషించుకోవడానికి అదనపు సమయం దొరికింది.

8వ వేతన సంఘం ఏయే ప్రాంతాలలో పర్యటిస్తుంది?

8వ వేతన సంఘం హైదరాబాద్ (మే 18-19), జమ్మూకశ్మీర్ (జూన్ 1-4), మరియు లడఖ్ (జూన్ 8)లలో పర్యటిస్తుంది. ఈ పర్యటనల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తుంది.

8వ వేతన సంఘం ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ ఎంత ఉండవచ్చు?

7వ వేతన సంఘం సమయంలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 2.57గా ఉంది. 8వ వేతన సంఘం విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ, ఉద్యోగ సంఘాలు దీనిని గణనీయంగా పెంచాలని కోరుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget