బైజు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు 6 నెలల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. ఆస్తులకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం దీనికి కారణం.
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
సింగపూర్ కోర్టు బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ (Byju Raveendran Jail) కు 6 నెలల జైలు, 70,500 డాలర్ల జరిమానా విధించింది. గతంలోనూ పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.

- బైజు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు 6 నెలల జైలు, భారీ జరిమానా విధించింది.
- ఆస్తులకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ శిక్ష పడింది.
- అమెరికా కోర్టు కూడా రుణ ఒప్పందాల ఉల్లంఘనపై తీర్పు ఇచ్చింది.
- ఫెమా ఉల్లంఘనలు, ఇతర కేసులతో బైజుస్ సంస్థ చట్టపరమైన సమస్యల్లో ఉంది.
Byju Raveendran Latest News: భారత్‌లో తక్కువ సమయంలోనే అత్యంత ఆదరణ పొందిన స్టార్టప్‌లలో ఒకటైన ఎడ్‌టెక్ కంపెనీ బైజుస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు బిగ్ షాక్ తగిలింది. సింగపూర్ కోర్టులో బైజు రవీంద్రన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించింది. ఏప్రిల్ 2024 నుంచి తన ఆస్తులకు సంబంధించిన అనేక కోర్టు ఉత్తర్వులను బైజు రవీంద్రన్ పదేపదే ఉల్లంఘించారని, అందుకే ఆయనకు జైలు శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది. చట్టప్రకారం ఎవరిపై అయినా చర్యలు తప్పవని, కోర్టు ధిక్కరణ కేసులో రవీంద్రన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
బైజు రవీంద్రన్ కేసు ఏంటీ..
రవీంద్రన్‌ను బీర్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్ చట్టపరమైన యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాలని సింగపూర్ కోర్టు ఆదేశించిందని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి. ఇది అనుబంధ సంస్థలో వాటాలను కలిగి ఉంది. అదే సమయంలో రవీంద్రన్ తన ఓనర్‌షిప్ నిరూపించుకోవడంతో పాటు అధికారుల ఎదుట లొంగిపోవాలని కూడా కోర్టు ఆదేశించింది. దీంతో పాటు రవీంద్రన్ 90,000 సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు 70,500 అమెరికన్ డాలర్ల న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని జరిమానా విధించినట్లు సమాచారం.
Also Read: CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
రవీంద్రన్ నికర విలువ ఎంత?
రవీంద్రన్ ఆస్తుల విషయానికి వస్తే ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ 2024 ప్రకారం, ఏప్రిల్ 4న అతని నికర విలువ 2.1 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.17,545 కోట్లు. ఆ తర్వాత, ఈ సంవత్సరం ఫోర్బ్స్ గత సంవత్సరం జాబితా నుండి నలుగుర్ని తొలగించగా.. ఇందులో రవీంద్రన్ ఒకరని తెలిసిందే. బ్లాక్‌రాక్ బైజూస్ విలువను 1 బిలియన్ డాలర్లకు తగ్గించింది. అయితే 2022లో దీని విలువ 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే బైజూస్ వాటాదారులు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో బిలియనీర్‌గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన రవీంద్రన్ ప్రస్తుతం నికర ఆస్తుల విలువ ఏమీ లేదని తెలుస్తోంది. నష్టాల్లో కూరుకుపోయి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల వాళ్లకు కూడా చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.
గతంలో అమెరికా కోర్టు కీలక తీర్పు
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు నవంబర్ 2025లో అమెరికా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. లోన్ అగ్రిమెంట్స్ ఉల్లంఘించి సుమారు రూ.4,470 కోట్లు అక్రమంగా దారి మళ్లించారనే కేసులో, ఆయన వ్యక్తిగతంగా రూ.8,400 కోట్లు చెల్లించాలని కోర్టు డిఫాల్ట్ జడ్జ్‌మెంట్ ఇచ్చింది. లోన్ తీసుకున్న నిధులను తన సొంత సింగపూర్ ఎంటిటీ అయిన 'బైజూస్ గ్లోబల్'కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం బైజూస్ కార్యకలాపాలు నిలిచిపోగా, రవీంద్రన్ విదేశాలలో సీక్రెట్‌గా జీవిస్తున్నారని తెలుస్తోంది. భారత్‌లోనూ ఆయనపై ఈడీ నిఘా పెట్టింది. రూ.9,362 కోట్ల ఫెమా (FEMA) ఉల్లంఘనల ఆరోపణలపై 2024లోనే ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వీటితో పాటు, బీసీసీఐ (BCCI) స్పాన్సర్‌షిప్ బకాయిల వల్ల ఎన్‌సిఎల్‌టి (NCLT) ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ, జీఎస్టీ ఎగవేత నోటీసులు, ఖతార్ ఫండ్ (QIA) మోసం కేసులు బైజూస్ రవీంద్రన్‌ను చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఈ సంస్థ భారత్, అమెరికా, సింగపూర్ దేశాల్లో ఏకకాలంలో తీవ్ర చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
Before You Go
Budget 2026 - 2027 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు
Frequently Asked Questions
బైజు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టులో ఎలాంటి శిక్ష పడింది?
బైజు రవీంద్రన్‌పై ఏ కేసులో అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది?
లోన్ అగ్రిమెంట్స్ ఉల్లంఘించి సుమారు రూ.4,470 కోట్లు అక్రమంగా దారి మళ్లించారనే కేసులో అమెరికా కోర్టు బైజు రవీంద్రన్‌కు రూ.8,400 కోట్లు చెల్లించాలని డిఫాల్ట్ జడ్జ్‌మెంట్ ఇచ్చింది.
బైజుస్ సంస్థ ప్రస్తుతం ఎలాంటి చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది?
బైజుస్ ప్రస్తుతం భారత్, అమెరికా, సింగపూర్ దేశాల్లో ఫెమా ఉల్లంఘనలు, బీసీసీఐ స్పాన్సర్‌షిప్ బకాయిలు, ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ, జీఎస్టీ ఎగవేత, ఖతార్ ఫండ్ మోసం వంటి అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
బైజు రవీంద్రన్ నికర విలువ ఎంత?
ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ 2024 ప్రకారం, ఏప్రిల్ 4న అతని నికర విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే, ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం, ప్రస్తుత పరిస్థితిలో నికర ఆస్తుల విలువ ఏమీ లేదని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















