By: ABP Desam | Updated at : 30 Dec 2021 09:18 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
కరోనా కొత్త వేరియంట్లు ఒకదాని తరువాత ఒకటి దాడి చేస్తూనే ఉన్నాయి. దీంతో రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్కులు కూడా తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి. ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్ నుంచి అన్ని మాస్కులు రక్షణ కల్పిస్తాయా? కాదంటున్నారు అంతర్జాతీయ వైద్యులు. ఒమిక్రాన్ నుంచే కాదు, ఏ వైరస్ నుంచి కూడా కాటన్ మాస్కులు రక్షణ కల్పించలేవని చెబుతున్నారు.
అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో మాస్కులపై ఓ కార్యక్రమం జరిగింది. దీనికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైద్యులు హాజరయ్యారు. వారిలో డాక్టర్ లియాని వెన్ ఒకరు. ఆయన మాట్లాడుతూ చాలా మంది డ్రెస్‌లకు మ్యాచింగ్‌గా కాటన్, ఇతర ఫ్యాబ్రిక్‌తో చేసిన మాస్కులు వస్తున్నాయని, వాటిని వాడడం వల్ల ఉపయోగం లేదని హెచ్చరించారు. అన్నింటికన్నా ప్రభావవంతంగా పనిచేసేవి N95 లాంటి మాస్కులేనని తెలిపారు. నోటినుంచి వచ్చే తుంపరలని, తుమ్మినప్పుడు వచ్చే తుంపరలని కాటన్ మాస్కులు పీల్చేసుకుంటాయి, దీని వల్ల వైరస్ మాస్కుకే అంటుకుని ఉండే ప్రమాదం ఉంది. అందుకే KN95, N95, KF94 లాంటి మాస్కులు వాడమని చెబుతున్నారు వైద్యులు. ఇవి పెద్ద తుంపరల్లోని వైరస్ ను కూడా బయటే ఆపగలవు. ఈ మాస్కులు దాదాపు 95 శాతం వరకు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటాయి. అయితే ఏ మాస్కు నైనా రోజూ ఉతకడం మాత్రం చాలా ముఖ్యం.
KN95, N95, KF94... ఈ మాస్కులు ఒకే లేయర్‌తో కాకుండా మూడు లేయర్లతో తయారవుతాయి. కాబట్టి రక్షణ అధికంగా అందిస్తాయి. మిగతా సింగిల్ లేయర్ మాస్క్ లు కేవలం 50 శాతం మాత్రమే రక్షణ కల్పిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటూ, ఇలాంటి మాస్కులు వాడడం ద్వారా ఒమిక్రాన్ వంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందవచ్చు.
Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?
Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి
Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది
Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>