By: ABP Desam | Updated at : 30 Dec 2021 08:00 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
ధూమపానం ఇచ్చే కొద్ది క్షణాల మత్తు కోసం దానికి బానిసలై తమ ఆరోగ్యాన్నే కాదు, పక్క వారి ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నారు ఎంతోమంది. ఒకరు ధూమపానం చేస్తుంటే పక్కనే ఉన్నా చాలా మంది ఆ పొగను పీల్చుతుంటారు. ఇలా పీల్చేవారిని పాసివ్ స్మోకర్స్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎంత ప్రమాదమో తెలుసా? ఆ పొగలో 7000 రసాయనాలు ఉంటాయి. అందులో కొన్ని వందల రసాయనాలు చాలా విషపూరితమైనవి. ఓ 70 రసాయనాలు క్యాన్సర్ కు కారణమవుతాయి. సిగరెట్ కాలుతున్నప్పుడు వచ్చే పొగ, సిగరెట్ తాగిన వ్యక్తి వదులుతున్న పొగ, ఈ రెండింటి మిశ్రమ పొగను పాసివ్ స్మోకర్లు పీలుస్తారు. ఇది ఇంకా విషపూరితం.
సర్జన్ జనరల్ నివేదిక ప్రకారం 1964 నుంచి ఇప్పటివరకు దాదాపు పాతికలక్షల మంది సెకండ్ హ్యాండ్ స్మోకర్లు మరణించారు. వీరెవ్వరికీ ధూమపానం అలవాటు లేదు. ఈ పొగపీల్చిన వారికి కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే శ్వాసకోశ సమస్యలు, చెవిలో ఇన్ ఫెక్షన్లు కూడా వస్తాయి. పాసివ్ స్మోకర్లకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 25 నుంచి 30 శాతం అధికం. అలాగే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా మిగతావారితో పోలిస్తే 20 నుంచి 30 శాతం ఎక్కువ.
పొగతో పిల్లల్లో ఆర్ధరైటిస్
తాజా అధ్యయనం ప్రకారం చిన్నప్పటి నుంచి పొగను పీలుస్తున్న పిల్లల్లో పెద్దయ్యాక రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ కీళ్ల వాతం రావచ్చు. అందుకే పిల్లల దగ్గర పొగను పీల్చుకుండా ఉండడం మంచిది. మీరు విడిచిన పొగ, వారి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది.
శిశువులకు ప్రాణాంతకం
ధూమపానంలో విడుదలయ్యే పొగ శిశువుల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ఆ పొగ పీల్చిన నెలల వయసు చిన్నారులు తీవ్రమైన ఆస్తమా దాడులకు, శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లకు గురవుతారు. ఆకస్మికంగా మరణించే ప్రమాదం కూడా ఉంది. గర్భిణిలు పొగతాగినా కూడా పుట్టే పిల్లలు మరణించే అవకాశం పెరుగుతుంది. కాబట్టి గర్భిణిలు, శిశువులు కలిగిన తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం నుంచి వచ్చే పొగ పిల్లలకు చేరకుండా చూసుకోవాలి. వారికి దగ్గర్లో ఎవరూ పొగతాగకుండా జాగ్రత్తపడాలి. ఆ పొగ వల్ల శిశువుల్లో ‘సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్’ పెరుగుతుంది. అంటే నిద్రలోనే వారు హఠాత్తుగా మరణిస్తారు. మీకు కారణం కూడా తెలియదు. అందుకే స్మోకింగ్ చేయడం వల్ల వచ్చే పొగకి పిల్లలను దూరంగా ఉంచాలి.
ధూమపానం చేసేవారికి ఒక విజ్ఞప్తి... మీ ఆరోగ్యాన్ని ఎలాగూ చెడగొట్టుకుంటున్నారు. పక్కవాళ్లకి కూడా అనారోగ్యాలు తెచ్చిపెట్టద్దు. వీలైతే ధూమపానం మానేయండి. మానేయలేకపోతే మీవల్ల పక్కవారికి సమస్య కాకుండా ఎవరూ లేని ప్రదేశంలో కాల్చండి.
Miss India 2022: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి
Rose Petals: గులాబీ పూల రెక్కలను గిన్నెలో పోసి ఇంట్లో ఉంచితే ఆరోగ్యమా లేక ఆర్ధిక లాభమా?
Mandara Oil: జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగాలా? ఇలా మందార తైలాన్ని తయారుచేసి వాడండి
Carrot Rice: పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్, తెలివితేటలు పెంచుతుంది
matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం
Alluri Jayanthi: తెలుగు జాతికి గర్వకారణం అల్లూరి, జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదు: చంద్రబాబు
Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై మోదీ - విల్లు, బాణం ధరించిన ప్రధాని
PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు
Viral Video: మేళతాళాల మధ్య మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్, అక్కడ అదే ఆచారమట