Coronavirus: కరోనా బారిన పడకుండా ఉండాలంటే వంటల్లో ఉప్పు తగ్గించాల్సిందే
కరోనాకు ఉప్పు తగ్గించడానికి ఏమిటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? ఉంది. చదివితే మీకే అర్థమవుతుంది.
కూర రుచిగా ఉండాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ దట్టంగా పడాల్సిందే. కానీ రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకుంటారు. అందుకే ఉప్పును తగ్గించాల్సిందే. ఉప్పుడు మనకు తెలియకుండానే రుచి కోసం అధికంగా తినేస్తున్నాం. దీని వల్ల దీర్ఘకాలంలో అనేక సమస్యలు మొదలవుతాయి. అంతేకాదు ఉప్పు తక్కువగా తింటే కరోనా బారిన పడే అవకాశం తగ్గుతుంది, అలాగే కరోనా వైరస్ మీ శరీరంలో చేరినా దాన్ని తట్టుకునే శక్తి శరీరానికి ఉంటుంది.
ఏమిటి సంబంధం?
ఉప్పుకు, కరోనా వైరస్‌కు ఏమిటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? ఉప్పు అధికంగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతుంది. జర్మనీకి చెందిన యూనివర్సిటి ఆఫ్ బాన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం ఉప్పు కలిగిన ఆహారం తీవ్రమైన బాక్టీరియల్ ఇన్షెక్షన్‌కు కారణమవుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏ వైరస్, బ్యాక్టిరియా అయిన త్వరగా దాడి చేసే అవకాశం పెరుగుతుంది. కరోనా కాలంలో రోగినిరోధక శక్తిని పెంచుకోవాలి కానీ, తగ్గించుకునే పనులు చేయకూడదు.
ఈ పరిశోధన కోసం కొంతమందిని ఎంపిక చేసి వారికి కొన్ని రోజుల పాటూ అధికంగా ఉప్పుని తినిపించారు. రోజుకు ఆరు గ్రాముల ఉప్పును అదనంగా వినియోగించేలా చేశారు. కొన్ని రోజుల తరువాత వారి రోగనిరోధక వ్యవస్థలో మార్పులను పరిశీలించారు. అందులో రోగనిరోధక శక్తిని పూర్తిగా బలహీనపరిచినట్టు బయటపడింది. అధిక ఉప్పు వినియోగం రక్తపోటును పెంచుతుంది, తద్వారా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
రోజుకు ఎంత తినాలంటే...
ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెప్పిన దాని ప్రకారం రోజుకు ఒక మనిషి ఐదు గ్రాముల ఉప్పును తినవచ్చు. ఇది ఒక టీ స్పూన్‌కు సమానం. అంతకుమించి తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వంటల్లో తగ్గించాల్సిందే...
రుచి కోసం బిర్యానీల్లో, కూరల్లో ఉప్పు అధికంగా వేసి వండుతారు. ఆరోగ్యం కోసం ఉప్పును తగ్గించి వండాల్సిందే. కూరల్లో తక్కువ నీళ్లు వేసి వండితే తక్కువ ఉప్పుతో సరిపెట్టవచ్చు. నీళ్లు అధికంగా కలిపే కొద్దీ ఉప్పు వేయడం అధికమవుతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.