By: ABP Desam | Updated at : 28 Dec 2021 08:08 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
గుడ్డుతో చేసే వంటకాలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాశ్చాత్య దేశాల్లో అల్పాహారాల్లో ప్రధాన పాత్ర గుడ్డుదే. రోజూ గుడ్డు తిననిదే ఏదో వెలితిగా ఫీలయ్యేవారు ఎంతోమంది. కానీ ఒక కొత్త అధ్యయనం వారికి షాకిచ్చేలా ఉంది. కొత్త అధ్యయనం ప్రకారం రోజూ గుడ్డు తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. గుడ్డు తినని వారితో పోలిస్తే తినే వారిలో 60 శాతం మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అందులో మగవారి కన్నా గుడ్డు తినే ఆడవారికే ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అధ్యయనాన్ని చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖాతార్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి నిర్వహించారు.
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త మింగ్ మాట్లాడుతూ ‘టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణమైన ఆహారం, ఆరోగ్యపరిస్థితులను అర్థం చేసుకోవాలి. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహార కారకాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం’ అని చెప్పారు. గుడ్డు వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాలో 1991 నుంచి 2009 వరకు గుడ్డు తినే వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. అయితే గుడ్డుకు మధుమేహానికి మధ్య బంధాన్ని తెలుసుకునేందుకు చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి.
తేలింది ఇదే...
మింగ్ చెప్పిన ప్రకారం దీర్ఘకాలంగా రోజూ గుడ్డు తినే (రోజుకు 38 గ్రాముల కన్నా ఎక్కువ) చైనీయుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం పాతిక శాతం పెరిగింది. అలాగే రోజూ రెండు కన్నా అధిక గుడ్లు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగింది. ఈ అధ్యయన ఫలితాలు అధిక గుడ్డు వినియోగం మధుమేహానికి దారితీయచ్చని చెబుతున్నప్పటికీ, అది నిరూపించడానికి మరింత లోతైన పరిశోధన అవసరం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?
Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు
Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?
Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!
Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..
Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!
Tax on Petrol, Diesel: పెట్రోల్, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?
Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!
10th Class Diaries Movie Review - 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Tracking Tigers: పులులు దొరక్కుండా ఎలా తప్పించుకుంటాయ్, వాటిని ఎలా ట్రాక్ చేస్తారు?