Tea: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?
టీ తోనే రోజు మొదలవుతుంది చాలా మందికి. కానీ మీరు రోజూ తాగే టీ మీ బరువును పెంచుతుందేమో ఓసారి చూసుకోండి.
మనదేశంలో టీకి అభిమానులు ఎక్కువ. టీ తాగకపోతే ఏ పని చేయకుండా తల పట్టుకుని కూర్చుండి పోయే వారే ఎక్కువ. టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజు రెండు మూడు సార్లకు పైగా మీరు తాగే టీ మీ బరువును పెంచుతోందా. దీనిపై మీకు ఏమైనా అవగాహనా ఉందా? ఆలోచనలో పడ్డారా.... మమ్మల్ని నిజం చెప్పమంటారా? టీ మీ బరువును పెంచుతోంది. నమ్మలేకపోయినా ఇది నిజం.
టీ రుచికి దాసోహమైన వాళ్లకి, ఆ పానీయానికి బానిసలైన వారికి నమ్మడానికి కష్టమైన విషయమే. కానీ ఇది నిజం. బరువు అధికంగా ఉన్నవారు టీ తాగడం మానుకోవడమే ఉత్తమం. అందులోనూ చాలా మంది రోజుకి రెండు నుంచి అయిదు టీల వరకు తాగుతారు. ఒక సాధారణ కప్పు టీలో సుమారు 126 కేలరీలు ఉంటాయి. టీలో వేసే పాలు, చక్కెర వల్లే ఈ కేలరీలు పెరుగుతాయి. ఊబకాయంతో బాధపడే వాళ్లు కూడా టీ తాగకూడదు.
ఇలా చేసుకోండి...
టీ తాగడం మానలేని వారు కాస్త మార్పులు చేసుకుని తాగితే బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది. టీలో పాలు, పంచదార వేసుకోవడం తగ్గించుకోవాలి. లేదా పంచదారకు బదులు బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది. క్యాలరీల సంఖ్య తగ్గిస్తే టీ ఎన్నిసార్లు తాగినా మంచిదే. కాబట్టి కొవ్వు తీసేసిన పాలు బయట దొరుకుతున్నాయి. వాటితో టీ చేసుకోవడం మంచిది. లేదా ఓట్స్ మిల్క్, బాదం లేదా సోయా మిల్క్ వంటి డైరీ ఫ్రీ మిల్క్‌లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: రెడ్ వైన్ తాగితే బరువు నుంచి డిప్రెషన్ వరకు ఏదైనా తగ్గాల్సిందే, మధుమేహులకు మరీ మంచిది
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్