Cardiac Arrest: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
కార్డియాక్ అరెస్టు (Cardiac Arrest) ఎప్పుడొస్తుందో, ఎప్పుడు ప్రాణాన్ని లాక్కెళుతుందో చెప్పలేం. కానీ కొన్ని లక్షణాలు అప్పుడప్పుడు బయటపడొచ్చు.
Cardiac Arrest Symptoms And Causes: కార్డియాక్ అరెస్ట్ అనేది ప్రాణాంతక స్థితి. సకాలంలో చికిత్స అందకపోతే మరణం సంభవించడం ఖాయం. నిజానికి కార్డియాక్ అరెస్టు వచ్చిన సందర్భాలలో బతికిన వారి శాతం చాలా తక్కువ. అందుకే కార్డియాక్ అరెస్టును క్రూరమైన కిల్లర్ అని చెప్పుకోవచ్చు. కార్డియాక్ అరెస్టులో హఠాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇది కేవలం వయసుమీరని వాళ్లలోనే కాదు, యువతలో కూడా పెరిగిపోయింది.
కార్డియాక్ అరెస్ట్ అంటే...
మన గుండె విద్యుత్ ప్రేరణలతో పనిచేస్తుంది. ఈ ప్రేరణలు సరిగా లేనప్పుడు హృదయ స్పందనలు క్రమరహితంగా మారుతాయి. ఈ స్థితిని అరిథ్మియా అంటారు. హృదయ స్పందనలు ఒక్కోసారి హఠాత్తుగా ఆగపోతాయి. అప్పుడు కార్డియాక్ అరెస్టు ఏర్పడుతుంది. అలా కాకుండా గుండెకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. ఇదే గుండె పోటుకు, కార్డియాక్ అరెస్టుకు మధ్య తేడా.
కార్డియాక్ అరెస్టుకు ముందు కనిపించే లక్షణాలు
1. అపస్మారక స్థితి: వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్డియాక్ అరెస్టుకు సంబంధించి సాధారణ ప్రారంభ లక్షణం అపస్మారకస్థితి. తరచుగా తల తిరగడం వంటివి కూడా కలగవచ్చు. ఇలా తల తిరగడం అనేది హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి అపస్మారక స్థితిని, తలతిరగడాన్ని తక్కువ అంచనా వేయద్దు.
2. నిరంతర ఛాతీనొప్పి: కార్డియాక్ అరెస్టుకు సంబంధించి మరో ముఖ్య సూచన నిరంతరం వచ్చే ఛాతీ నొప్పి. శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఏ పనీ చేయకుండా ఉన్నప్పుడు కూడా ఛాతీ నొప్పి వస్తుంది. దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. వెంటనే వైద్యులను కలవాలి. వారు ఈసీజీ తీసి మీ గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు.
3. శ్వాస ఆడకపోవడం: సాధారణంగా తీవ్రమైన వ్యాయామం, మెట్లు ఎక్కడం, హైకింగ్ వంటివి చేసినప్పుడు శ్వాస అందడం కష్టమవుతుంది. కానీ సాధారణ పరిస్థితుల్లో కూడా తరచుగా శ్వాసఆడడం కష్టంగా ఉంటే మీకు గుండె సమస్య ఉందేమో అనుమానించాలి. వెంటనే వైద్యుడిని కలవాలి.
4. గుండె దడ: తరచూ ఆత్రుతగా, గుండెల్లో దడగా, ఆందోళనగా అనిపిస్తుంటే తక్కువ అంచనా వేయకండి. క్రమరహిత హృదయ స్పందనల వల్ల కూడా ఇలా జరుగుతుంది. చివరికి అరిథ్మియాకు దారితీయచ్చు.
5. బలహీనత, మైకం కమ్మడం: కార్డియాక్ అరెస్ట్ దారి తీసే పరిస్థితుల్లో ఉన్న రోగులు రోజంతా బలహీనంగా ఉండడమే కాదు, వారికి కొన్నిసార్లు మైకం కమ్మినట్టు ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలను కూడా తేలికగా తీసుకోవద్దు.
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: గుడ్ న్యూస్... మలేరియాను అడ్డుకునే టీకా వచ్చేసింది, ప్రత్యేకంగా పిల్లల కోసం...
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Also Read: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Also Read: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Also Read: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి మధ్య బంధమేంటి?