Injection: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
ఇంజెక్షన్లంటే చాలా మందికి భయం. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు సూదంటే భయపడి చాలా మంది పారిపోయారు.
కరోనా వచ్చాక వ్యాక్సిన్ అనే పదం బాగా పాపులర్ అయిపోయింది. వ్యాక్సిన్ అనగానే సూదితో పొడిచేవేనా, నొప్పి పెట్టకుండా మెత్తగా పని కానిచ్చేవి లేవా? అన్న చర్చలు జరిగాయి. ఎందుకంటే చాలా మంది సూది మందుకి భయపడి చెట్లెక్కి కూర్చోవడం, కిందపడి దొర్లి ఏడవడం, మరికొందరు వైద్య సిబ్బందిని కొడతామంటూ బెదిరించడం... ఇలా రకరకాల విన్యాసాలు చేశారు. అందుకే సూది లేని ఇంజెక్షన్ పై పరిశోధనలు పెరిగాయి. నిజం చెప్పాలంటే ఆవిష్కరణలు కూడా జరిగాయి. కానీ ప్రాచుర్యంలోకి రాలేదు. త్వరలో ఇవి ప్రపంచాన్ని కమ్మేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇంజెక్షన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు.
రోబో ఇంజెక్షన్...
ఒక్క దేశంలో మాత్రమే కాదు చాలా దేశాల్లోని ల్యాబోరేటరీలో సూది అవసరం లేని ఇంజెక్షన్ తయారీపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఒక కొలిక్కి వచ్చి క్లినికల్ ట్రయల్స్ దశను దాటాయి కూడా. కెనాకు చెందిన ఓ యూనివర్సిటీ వారు ‘కొబి’ పేరుతో ఒకరోబోను తయారుచేశారు. అది సూది లేకుండానే మందును మీ శరీరంలోని పంపిస్తుంది. అది కూడా మిమ్మల్ని టచ్ చేయకుండానే. మీకు రెండు మూడు సెంటీ మీటర్ల దూరం నుంచే అధిక ఒత్తిడితో మందును శరీరంలోకి పంపిస్తుంది. నొప్పి కూడా ఉండదు. ఇంకా ఇది పరిశోధనా దశలోనే ఉంది.
మనదేశంలో....
దేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్ తరువాత ఇప్పుడు మరో దేశీ కరోనా వ్యాక్సిన్ సిద్ధమైంది. ZyCov-D అని పిలిచే ఈ వ్యాక్సిన్ ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆగస్టులో ఆమోదించింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ వ్యాక్సిన్‌కు సూది అవసరం లేదు. దీన్ని మూడు డోసుల్లో ఇస్తారు. ఈ సూది రహిత వ్యాక్సిన్‌ను కాడిలా హెల్త్ కేర్ సంస్థ తయారు చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలోని సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ (CDL)లో దీన్ని పరీక్షించారు. ఇప్పటివరకు 2,37,530 డోసుల వ్యాక్సిన్ తయారుచేసారు. ఇది మనుషుల వినియోగం తయారుచేసిన మొట్టమొదటి ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కేవలం బీహార్, జార్ఘండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే దొరుకుతోంది. ధర పదకొండువందల రూపాయలు. అది కూడా ప్రభుత్వ ధర. ఇక ప్రైవేట్ ఆసుపత్రులలో అయితే రెండు రెట్లు అధిక ధరకే అమ్మవచ్చు.
Read Also: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి మధ్య బంధమేంటి?
Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
Read Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం