By: ABP Desam | Updated at : 22 Dec 2021 01:04 PM (IST)
Edited By: harithac
జ్ఞానానందిని దేవి (Image credit: Wikipedia)
చరిత్ర... పదం చిన్నదే కావచ్చు, ఏ విషయం గురించైనా తవ్వుతూ ఉంటే ఆ చరిత్రలో ఎన్నో నిజాలు, అంశాలు బయటికి వస్తూనే ఉంటాయి. అలాగే చరిత్రలో చీరకట్టుకూ, రవీంద్రనాథ్ ఠాగూర్‌కు మధ్య ఉన్న బంధం కూడా చాలా ఏళ్లుగా చర్చకు వస్తూనే ఉంది. ప్రొఫెసర్, ప్రముఖ రచయిత జస్విందర్ కౌర్ భారతీయ వస్త్రధారణ గురించి, బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన మార్పుల గురించి ఓ ఇంటర్య్వూలో పంచుకున్నారు. ఆయన 'ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ది బ్రిటిష్ రాజ్ ఆన్ ది అటెయిర్ అండ్ టెక్స్‌టైల్స్ ఆఫ్ పంజాబ్' అనే పుస్తకాన్ని రచించారు. జస్విందర్ కౌర్ చెప్పిన వివరాల ప్రకారం. మన నేటి చీరకట్టు వెనుక రవీంద్రఠాగూర్ కుటుంబం ప్రభావం చాలా ఉంది.
ప్రస్తుత మన చీరకట్టు, వాస్తవానికి బ్రిటిష్ వారి నుంచి ప్రేరణ పొందినట్టు చెప్పారు జస్విందర్ కౌర్. అలా మొదట ప్రేరణ పొందింది ఎవరో కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ భార్య జ్ఞానానందిని దేవి. సత్యేంద్రనాథ్ ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరిన మొదటి భారతీయుడు. దీంతో అతను విదేశీయులతో కలిసి పార్టీలు, వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చేది. అది కూడా భార్యాసమేతంగా వెళ్లాలి. అప్పట్లో భారత స్త్రీలు చీర మాత్రమే కట్టుకునేవారు. బ్లౌజు వంటివి ఉండేవి కావు. చీర ఇప్పట్లా కాకుండా, చుట్టుకున్నట్టు ఉండేది. కానీ విదేశీయులతో చర్చలు, విందుల్లో పాల్గొనేటప్పుడు ఆ చీరకట్టు అఫీషియల్ గా ఉండదని అనిపించింది ఆమెకు. అందుకే ఆమె సొంతంగా రకరకాల చీరకట్టులను ప్రయత్నించింది.
బ్లౌజుకి కారణం ఈమెనా?
బ్లౌజు వేసుకుని చీరకట్టు కోవడం మొదలైంది కూడా జ్ఞానానందిని దేవి వల్లే అంటారు జస్విందర్ కౌర్. ఆమె విదేశీయుల టాప్స్ ను చూసి అలా జాకెట్లను కుట్టించి ప్రయోగాలు చేసిందని చెబుతున్నారు. చీర కూడా పైట దగ్గర స్టెప్పుల్లా మడత పెట్టడం కూడా కనిపెట్టింది ఈవిడేనంటారు. ఆ చీరకట్టే అలా ప్రాచుర్యం పొంది... ప్రస్తుతం బాగా పాపులర్ అయింది. ఇప్పుడు భారతదేశంలోని మహిళలంతా ఆమె చీరకట్టునే ఫాలో అవుతున్నారు. అందుకే చీరకట్టుకు రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చాలా అనుబంధముందని చెప్పుకుంటారు.
Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
Read Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Healthy Tea for Weight Loss : కడుపు ఉబ్బరంతో పాటు బరువును తగ్గించగలిగే టీ ఇదే
Google Lens : గూగుల్ లెన్స్‌తో మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు తెలుసా?
Mustard Oil: చలికాలంలో చర్మాన్ని రక్షించే ఆవనూనె, ఇలా ఉపయోగించండి
Telugu Recipes: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి
Low Carb Diet : బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఫుడ్స్ కచ్చితంగా తినండి
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>