Malaria Vaccine: గుడ్ న్యూస్... మలేరియాను అడ్డుకునే టీకా వచ్చేసింది, ప్రత్యేకంగా పిల్లల కోసం...
మలేరియా ఎన్నో ఏళ్లుగా మనుషులను పట్టి పీడిస్తోంది. ఇప్పుడు దీనికి చెక్ పెట్టే టీకా వచ్చేసింది.
మలేరియా ప్రాణాంతక వ్యాధిగా గుర్తించారు చాలా మంది కానీ, అది ప్రాణాంతకమే. సరైన సమయంలో గుర్తించకపోతే మాత్రం పిల్లల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇక పట్టణ జీవితానికి, ఆసుపత్రులకు దూరంగా బతికే గిరిజనుల విషయంలో మాత్రం మలేరియా కరోనాను మించిన మహమ్మారి. ఎంతో మంది గిరిజన ప్రజలు, పిల్లలు ఏటా మలేరియా వల్ల మరణిస్తున్నారు. ఇంతవరకు మలేరియాకు సరైన వ్యాక్సిన్ కనుక్కొనలేదు. ఇప్పుడు తాజాగా మలేరియాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను కనిపెట్టారు శాస్త్రవేత్తలు.
పిల్లలకే ప్రమాదం
మలేరియా పరాన్న జీవుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి. ఆ పరాన్న జీవులు ఆడ ఎనాఫిలిస్ దోమలు. వీటి కాటు ద్వారానే ప్రజల్లో వ్యాపిస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 229మిలియన్ల మలేరియా కేసులు నమోదవ్వగా, అదే ఏడాది నాలుగు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అయిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలే అధికంగా మలేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో మలేరియా వల్ల మరణించిన నాలుగు లక్షల మందిలో 2,74,000 మంది పిల్లలే. అందుకే మనకు మలేరియాను అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్ అత్యవసరం.
ఏంటీ టీకా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన టీకా ఇది. పేరు మస్కిరెక్స్. ఇది మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ ను సమర్థం అడ్డుకున్నట్టు ప్రయోగాల్లో తేలింది. ఈ వ్యాక్సిన్ నాలుగు సార్లు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పిల్లల్లో 39 శాతం బాగా పనిచేసినట్టు బయటపడింది. అయితే 39 శాతం బాగా పనిచేయడం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదని చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఇప్పటివరకు తయారుచేసిన ఏ మలేరియా వ్యాక్సిన్ ఈ మాత్రం కూడా పనిచేయలేదు. క్లినికల్ డెవలప్మెంట్ ప్రక్రియను పూర్తి చేసుకున్న మొదటి మలేరియా వ్యాక్సిన్ ఇదే. అంతేకాదు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా ఈ వ్యాక్సిన్ విషయంలో సానుకూలంగా స్పందించింది.
ఈ వ్యాక్సిన్ ఆఫ్రికా దేశాల్లోని పిల్లలకు వరంగా మారనుంది. త్వరలో మలేరియాతో అధికంగా బాధపడుతున్న దేశాలకు అందుబాటులోకి రావచ్చు ఈ టీకా.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read Also: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Read Also: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త