Money Tips Telugu: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
How To Get Money: ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకోనిది ఎవరు? కొత్త ఏడాదిలో మీ కలను నెరవేర్చుకోండి. ఈ ఏడాది మిగిల్చిన నష్టాలను పక్కనపెట్టి మీరు ఈ పనులు చేస్తే చాలు.
Money Tips And Tricks: కొత్త ఏడాది రాకకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. నూతన సంవత్సరంలో మీ ఇల్లు సిరిసంపదలతో, భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నారా? 2021 మిగిల్చిన ఆర్ధిక కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారా? అయితే లక్ష్మీ దేవతకు స్వాగతం పలకాల్సిందే. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. డబ్బును ఆకర్షించే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉండేలా చూసుకోండి. కొత్త ఏడాది రావడానికి ముందే ఈ పని చేయండి. ఆ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు... మీరు ఎక్కడైతే మీ డబ్బును, బంగారాన్ని ఆ ఇంట్లో భద్రపరుస్తారో అక్కడే ఉంచాలి.
ఇలా చేయండి...
1. శుక్రవారం నాడు పసుపు వస్త్రంలో అయిదు కోడిగుడ్లు, వెండి నాణాలు, కొద్దిగా కుంకుమ పువ్వులు వేసి మూటలా కట్టాలి. ఆ మూటను ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టాలి. అలాగే కొన్ని పసుపు కొమ్ములు కూడా ఉంచాలి.
2. ఎర్రచందనం పొడిలో కాస్త నీరు కలిపి పేస్టులా చేయాలి. దాంతో భోజపాత్ర లేదా ఏదైనా ప్లేటుపై ‘శ్రీ’ అని రాయాలి. ఆ భోజపాత్రను డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి త్వరలో మిమ్మల్ని కటాక్షిస్తుంది. డబ్బు సంపాదన పెరుగుతుందని విశ్వసిస్తారు.
3. ఐశ్వర్య వృద్ధి యంత్రాన్ని మీ ఇష్టదైవం ముందు ఉంచి పూజించాలి. ఆ తరువాత దాన్ని డబ్బు దాచే ప్రదేశంలో భద్రంగా ఉంచాలి.
4. దక్షిణవర్తి శంఖాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఈ శంఖాన్ని మీ డబ్బు ఖజానాలో ఉంచినప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేస్తే ఆర్ధిక కష్టాలు తీరుతాయని కూడా చెబుతారు. ఇంట్లో డబ్బుతో పాటూ ఆనందం, శ్రేయస్సు కూడా వెల్లివిరుస్తాయని ప్రతీతి.
5. పూజల్లో ఉపయోగించిన వక్కలను గణేశ రూపంగా భావిస్తారు చాలా మంది. గణేశుడు ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని నమ్ముతారు భక్తులు. పూజలో ఉపయోగించిన వక్కలను డబ్బు దాచే ప్రదేశంలో ఉంచితే చాలా మంచిది. లక్ష్మిదేవి కూడా ఆ వక్కలతో పాటూ అక్కడే ఉంటుందని మీకు ఐశ్వర్య వృద్ధి జరిగేలా చేస్తుందని నమ్మకం.
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి