Pushpa & Political Leader: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప: ద రైజ్' సినిమా నేడు విడుదల అయ్యింది. ఇందులో ఓ రాజకీయ నాయకుడి క్యారెక్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప: ద రైజ్' సినిమా తెరకెక్కింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా నేడు విడుదల అయ్యింది. ఇందులో ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ చేసే చోటా మోటా నాయకులు అందరూ కలిసి ఓ సిండికేట్‌గా ఏర్పడతారు. ఆ సిండికేట్‌కు ఓ లీడర్ ఉంటారు. అయితే... ఆ లీడర్‌ను కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఓ రాజకీయ నాయకుడికి ఉందన్నట్టు చూపించారు. ఇంతకీ, ఆ రాజకీయ నాయకుడు ఎవరు? అదే కొందరిలో సందేహం.
సినిమా విడుదలకు ముందు రోజు హైదరాబాద్‌లోని విలేకరుల సమావేశంలో సినిమా కథ గురించి సుకుమార్ మాట్లాడుతూ "ఇది కూడా ఒక విధంగా పీరియడ్ మూవీ అండీ. ఎందుకంటే... 1996 - 2004 టైమ్ తీసుకున్నాం. సెల్‌ఫోన్స్ లేని టైమ్. టైమ్ పీరియడ్ గురించి ఎందుకు చెప్పలేదు అంటే... ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది ఇప్పుడూ జరుగుతోంది. అప్పుడూ జరిగింది. ప్రజెంట్ టాపిక్ కూడా. అందుకని, పీరియడ్ సినిమా అని ఎక్కువ హైలైట్ చేయలేదు. కామన్‌గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల్లో అన్నట్టు తీశాం. ఫిక్షనల్ పీరియడ్ అనుకోండి" అని అన్నారు. అయితే... సుకుమార్ మాటలకు నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చెక్ పెట్టారు. "సుకుమార్ గారు ఇప్పుడు ఏం (ఎర్ర చందనం స్మగ్లింగ్) జరగడం లేదు. ఒకవేళ జరిగితే ఎలా? అనేదాంట్లో మీరు అనుకున్నది. మీరు ఊహించుకున్నది. అంతేగా!" అని రవిశంకర్ అన్నారు. "ఓ... అలా వచ్చారా?" అని సుకుమార్ ఆగారు.
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
'పుష్ప'లో రాజకీయ నాయకుడి పాత్రలో రావు రమేష్ నటించారు. సినిమాలో ఆయన గెటప్, చిత్తూరు జిల్లాలో ఓ రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉందనేది కొందరి గుసగుస. ఆయనకు అంగబలం, అర్థబలం ఉన్నాయట. అది పక్కన పెడితే... రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేనా? ఎంపీనా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఓ సారి ఎమ్మెల్యే అని, మరోసారి ఎంపీ అని పాత్రధారులు అంటారు. బహుశా... కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఏమో? ఇంతకీ, ఆ రాజకీయ నాయకుడు ఎవరో? అని రాయలసీమలో చర్చ జరుగుతోంది. రావు రమేష్ క్యారెక్టర్ మాత్రమే కాదు, సినిమాలో కొన్ని క్యారెక్టర్లను చూస్తుంటే... అప్పట్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొంత మంది రాయలసీమ, తమిళనాడు సరిహద్దుల్లో నాయకులు గుర్తు వస్తున్నారని అక్కడి ప్రజలు అనంతున్నారట.
Also Read: బన్నీ ఫ్యాన్స్ బీభత్సం.. పుష్ప థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానుల రాళ్ల దాడులు
Also Read: 'అంతఃపురం'తో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పనున్న రాశీ ఖన్నా!
Also Read: ‘ఆల్ ది బెస్ట్ నాన్న...’ డ్రాయింగ్‌తో తండ్రికి అల్లు అయాన్ విషెస్
Also Read: Pushpa Twitter Review: అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో... ఇరగదీశాడట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి