News
News
X

Raashi Khanna: 'అంతఃపురం'తో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పనున్న రాశీ ఖన్నా!

డిసెంబర్ 31న రాశీ ఖన్నా నటించిన ఓ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఆ సినిమాతో ఈ ఏడాదికి రాశీ ఖన్నా వీడ్కోలు చెప్పనున్నారు.

FOLLOW US: 

హీరోయిన్ రాశీ ఖన్నా నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే... అందులో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. ఇది తెలుగులో ఆమె అభిమానులకు నిరాశ కలిగించిన అంశమే. ఇప్పుడు ఆ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆమె నటించిన ఓ సినిమా డిసెంబర్ 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా ఓ కథానాయికగా నటించిన తమిళ సినిమా 'అరణ్మణై - 3'. ఇందులో సుందర్ సి, ఆర్య హీరోలు. ఆండ్రియా మరో హీరోయిన్. సుందర్ సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు.  తమిళనాడులో అక్టోబర్ 14న విడుదల అయ్యింది. తెలుగులో డిసెంబర్ 31న 'అంతఃపురం' పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో ఆర్య, రాశీ ఖన్నా జంటగా నటించారు.

'అంతఃపురం' సినిమాలో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. ఉదయనిధి స్టాలిన్, ఖుష్బూ, ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో సినిమాను విడుదల చేస్తోంది. ఈ నెల 31న తెలుగు వెర్షన్ విడుదల చేస్తున్నట్టు గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది.

'అరణ్మణై' ఫ్రాంచైజీలో వచ్చిన తొలి సినిమా తెలుగులో 'చంద్రకళ' పేరుతో, రెండో సినిమా 'కళావతి' పేరుతో విడుదల అయ్యాయి. రెండు సినిమాలకూ మంచి స్పందన లభించింది. మూడో సినిమాలో వాటికి తోడు రాశీ ఖన్నా నటించడం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. సుందర్ సి మాట్లాడుతూ "తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు 'అంతఃపురం'లో చాలా ఉన్నాయి. హారర్, కామెడీ సీన్స్ ప్రేక్షకులు అందరికీ నచ్చేలా తీశాం. విజువల్ పరంగా గ్రాండ్ గా ఉంటుంది సినిమా" అని చెప్పారు. ఈ సినిమాకు తెలుగులో ఎ. శ్రీనివాస మూర్తి మాటలు... భువన చంద్ర, రాజశ్రీ సుధాకర్ పాటలు రాశారు. ఈ సినిమాకు సత్య సి సంగీత దర్శకుడు. ఎస్పీ అభిషేక్ నేపథ్య గానం అందించారు. 

Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: ‘ఆల్ ది బెస్ట్ నాన్న...’ డ్రాయింగ్‌తో తండ్రికి అల్లు అయాన్ విషెస్
Also Read: గౌతమ్ కి కాల్ చేసిన వసుధార.. షాక్ లో రిషి.. ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర..గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్
Also Read: నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: Pushpa Twitter Review: అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో... ఇరగదీశాడట!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Dec 2021 02:15 PM (IST) Tags: arya Raashi Khanna రాశీ ఖన్నా Andrea Jeremiah Anthapuram Anthapuram Release Date Aranmanai 3 Telugu News Aranmanai 3 Telugu Version Release Date Sundar C Sakshi Agarwal Vivek Yogi Babu Manobala

సంబంధిత కథనాలు

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

టాప్ స్టోరీస్

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

President Droupadi Murmu : ప్రపంచానికి భారత్‌ ఓ మార్గదర్శి, దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu : ప్రపంచానికి భారత్‌ ఓ మార్గదర్శి, దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము