Pushpa Twitter Review: అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో... ఇరగదీశాడట!

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ అల్లు అర్జున్ యాక్టింగ్ ఇరగదీశాడని నెటిజన్స్ కొందరు ట్వీట్ చేస్తున్నారు. బన్నీ వన్ మ్యాన్ షో చేశాడంటున్నారు.

FOLLOW US: 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణలో కొన్ని థియేటర్లలో ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలు పడినట్టు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్  హ్యాట్రిక్ మూవీ ఇది. అలాగే, ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్. ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడనేది మెజార్టీ నెటిజన్స్ చెప్పే మాట. అలాగే, యాక్షన్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు.
అల్లు అర్జున్ సెగలు పుట్టించాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. బన్నీ తప్ప ఎవరూ కనిపించలేదని ఇంకొకరు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బావుందని... చిత్తూరు యాసలో చిట్టకొడుతున్నాడని ఒకరు పేర్కొన్నారు. 'పుష్ప'లో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ ఒక రేంజ్ అంటున్నారు. టోటల్ గా డిఫరెంట్ బన్నీని చూస్తారని డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొన్న ఒకరు ట్వీట్ చేశారు. ఎలివేషన్ సీన్స్ అయితే హైలైట్ అట.
ఆల్రెడీ టీజర్, ట్రైలర్లలో బైక్ డ్రైవ్ చేస్తూ అడవుల్లో బన్నీ చేసిన ఫైట్ ఉంటుందని చూపించారు కదా! ఆ ఫైట్ ఇచ్చిన హై టికెట్ రేటుకు రెండింతలు న్యాయం చేస్తుందని ఒకరు ట్వీట్ చేశారు. ఫారెస్ట్ ఫైట్‌కు పొర్లు దండాలు పెట్టొచ్చని ఇంకొకరు అన్నారు. సమంత చేసిన స్పెషల్ సాంగ్, స్టెప్స్ కూడా హైలైట్ అంటున్నారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' పాటలో ఉందట. అల్లు అర్జున్, రష్మిక మధ్య లవ్ సీన్స్, కామెడీ సూపర్ అని ఒకరు ట్వీట్ చేశారు. సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సెకాండఫ్‌లో ఎంట్రీ ఇచ్చాడని నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. బహుశా... సీక్వెల్‌లో అతడి రోల్ ఎక్కువ ఉండొచ్చు. 'పుష్ప' సీక్వెల్‌కు 'పుష్ప: ద రూల్' టైటిల్ పెట్టారు. తమిళ్, హిందీ ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని ఒకరు ట్వీట్ చేశారు. అయితే... సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ టాక్, మిక్స్డ్ టాక్ కూడా నడుస్తోంది.   

Published at : 17 Dec 2021 05:06 AM (IST) Tags: Allu Arjun Rashmika Mandanna Anasuya Sukumar Sunil Pushpa Movie Release Fahad Fazil Pushpa Movie Review Pushpa Twitter Review Pushpa Movie Benefit Show Talk Pushpa Public Talk Pushpa Audience Response

సంబంధిత కథనాలు

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి

Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి

టాప్ స్టోరీస్

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ముగ్గురు మృతి

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ముగ్గురు మృతి

Govt Teachers Properties : పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం, టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు

Govt Teachers Properties : పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం, టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

Viral Video Today: మారథాన్‌లో మ్యారేజ్ ప్రపోజల్- ఇలాంటిది ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు!

Viral Video Today: మారథాన్‌లో మ్యారేజ్ ప్రపోజల్- ఇలాంటిది ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు!