Pushpa Movie: ‘ఆల్ ది బెస్ట్ నాన్న...’ డ్రాయింగ్‌తో తండ్రికి అల్లు అయాన్ విషెస్
పుష్ప సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాపై పెట్టుకున్న ఆశలు ఇన్నీ అన్నీ కావు. శేషాచలం కొండల సాక్షిగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు టీమ్ పెద్ద రేంజ్లో ప్రమోషన్లు నిర్వహించింది. శుక్రవారం పుష్ప సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం తెల్లవారుజామునే అల్లు అర్జున్ కళ్లు తెరిచేసరికి ఓ అందమైన డ్రాయింగ్ అతని కళ్ల ముందుంది. ముద్దులకొడుకు అయాన్ ఓ అబ్బాయి బొమ్మ వేసి దానికి పుష్ప అని పేరు పెట్టాడు. విడుదల తేదీని కూడా పక్కన రాశాడు. చివరలో ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాసి ఇచ్చాడు. అది చూసి మురిసిపోయాడు పుష్పరాజ్. ఆ డ్రాయింగ్ ను ఇన్ స్టాలో పోస్టు చేసిన అల్లు వారి హీరో ‘థ్యాంక్యూ సో మచ్ మై చిన్ని బాబు, ఐ లవ్ యూ అయాన్. నువ్వు నా ఉదయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చావు ’ అని క్యాప్షన్ పెట్టారు.
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా పుష్ప. అంతకుముందు ఆర్య, ఆర్య2 వచ్చాయి. ఆర్య ఎంత పెద్ద హిట్ట చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ దాదాపు 12 ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘పుష్ప’ వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ నేడు విడుదలవ్వగా, రెండోది వచ్చే ఏడాది విడుదల కానుంది. మొదటి పార్ట్ కు ‘పుష్ప: ది రైజ్’ అని పెట్టారు. అయితే రెండో పార్ట్ కు ‘పుష్ప: ది రూల్’ అని పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా చేస్తుండగా, అతడిని పట్టుకునే పోలీసాఫీసర్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్టు సమాచారం.
View this post on Instagram
Also Read: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















