News
News
X

Samantha & Pushpa: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి

పురుషుల సంఘానిది వంకరబుద్ధి అని మహిళా మండలి మండిపడుతోంది. సమంత స్పెషల్ సాంగ్‌కు స‌పోర్ట్‌గా రంగంలోకి దిగింది. 

FOLLOW US: 

'పుష్ప: ద రైజ్' సినిమాలో సమంత స్టెప్స్ వేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా... ఊఊ అంటావా' పాట మీద పురుషుల సంఘం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఆ పాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒడిలో కూర్చుని సమంత వేసిన స్టెప్ వైరల్ అవుతోంది. మరోవైపు పాటలో సాహిత్యం మీద కొందరు పురుషులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసింది. అయితే... ఇప్పుడు ఆ సాంగ్‌కు స‌పోర్ట్‌గా ఓ మహిళా మండలి రంగంలోకి దిగింది.
Also Read: మాకు లేవా మనోభావాలు.. సమంత స్పెషల్ సాంగ్ పై పురుషుల సంఘం కేసు
అమరావతిలోని తాళ్లూరు గ్రామంలో కోదండరామ ఆలయంలో 'ఊ అంటావా... ఊఊ అంటావా' పాటలో డాన్స్ చేసిన సమంతకు, ఆ పాట రాసిన గేయ రచయిత చంద్రబోసుకు స్థానిక మహిళామండలి సభ్యులు అర్చన చేశారు. అలాగే, వారి ఫొటోలకు పాలతో అభిషేకం చేశారు. అనంతరం పురుషులది దురహంకారమని, ఈ పాట మీద కేసు వేయడం దుశ్చ్యర్య అని మండిపడ్డారు. పురుషుల దురహంకారాలు, దుశ్చర్యలను ఎండగట్టే పాట మీద వివాదాన్ని రాజేసిన పురుష సంఘానిది వంకరబుద్ది అని దుయ్యబట్టారు. మహిళల ఐకమత్యం వర్థిల్లాలని నినాదాలు చేశారు. అంతే కాదు... 'పుష్ప' సినిమాను తొలి రోజు చూస్తామని, 'ఊ అంటావా' పాటకు ఈలలు వేసి, చెప్పట్లు కొడతామని చెప్పారు.
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మించిన 'పుష్ప' ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: ఎందుకీ తెల్లగెడ్డం రాజమౌళి? నాతో సినిమా ఎప్పుడు? - బాలకృష్ణ ప్రశ్న! మీసం తిప్పిన రాజమౌళి!
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్! 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 15 Dec 2021 06:24 PM (IST) Tags: Allu Arjun Pushpa samantha Pushpa Special Song Case On samantha Item Song Andhra Pradesh Men’s association Oo Antava Song Controversy Mahila Mandali Oo Antava Song Pushpa Songs

సంబంధిత కథనాలు

Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు

Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

టాప్ స్టోరీస్

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !

Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ  

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ