Allu Arjun: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు? 'పుష్ప' ప్రచార కార్యక్రమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎదురైన ప్రశ్న. దీనికి ఆయన ఏం సమాధానం చెప్పారో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప: ద రైజ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా విచ్చేశారు. బన్నీ గురించి బాగా మాట్లాడారు. ఇప్పటి వరకూ రాజమౌళి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వచ్చే అవకాశం ఉందా? అసలు, ఎప్పుడైనా ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయా? ఇటువంటి ప్రశ్నలకు 'పుష్ప: ద రైజ్' ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్ సమాధానం చెప్పారు.
"రాజమౌళి గారితో పని చేయాలని ప్రతి కథానాయకుడికీ ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది. 'మీతో సినిమా చేయాలని ఉంది' అని ఆయనతో నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 'తప్పకుండా చేద్దాం! నేను సినిమా చేయాలని అనుకునే ప్రామిసింగ్ హీరోల్లో నువ్వూ ఒకడివి' అని అన్నారు. కచ్చితంగా ఏదో ఒక రోజు మేం ఇద్దరం కలిసి సినిమా చేస్తామని ఆశిస్తున్నాను. 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు నా మనసును తాకాయి" అని అల్లు అర్జున్ అన్నారు.
'పుష్ప' (Pushpa The rise) ఈ నెల 17న విడుదల అవుతుంటే... వచ్చే నెల 7న రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) విడుదల అవుతోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు. 'పుష్ప' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయట. 'పుష్ప 2' కూడా ఉంది. ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్ కుదురుతుందేమో చూడాలి.
Also Read: బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన నటి.. ఫొటోలు వైరల్..
Also Read: అఫీషియల్... దర్శకుడిగా మరో అభిమానికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్
Also Read: 'తప్పని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు'.. 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్..
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

